prabhas comments radhe shyam movie
Radhe Shyam : ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యాం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మిశ్రమ స్పందన లభించింది. తెలుగు లో భారీ ఎత్తున ఓపెనింగ్ దక్కించుకున్న ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి అంటూ అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ మీడియా రాధేశ్యామ్ సినిమాని ప్లాప్ మూవీ అంటూ వార్తలు కథనాలు ఇస్తోంది.బాలీవుడ్ మీడియాలో సినిమా గురించి దారుణమైన ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో వసూలు తగ్గుతున్నాయి
అనేది టాక్. బాలీవుడ్ లో మంచి టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు నమోదైన కూడా అక్కడి మీడియా మాత్రం ప్రభాస్ పై మరియు తెలుగు సినిమా పై కోపంతో తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సాహో సినిమా సాధించిన వసూళ్లలో కనీసం పది శాతం కూడా వసూళ్లు సాధించలేదు అంటూ తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అక్కడి మీడియా.ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు బాలీవుడ్లో మంచి సక్సెస్ దక్కించుకుని వందల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే బాలీవుడ్ మీడియా వారు టాలీవుడ్ సినిమాలను విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అక్కడ పెద్ద సినిమాలు ఏమీ రాలేదు.
bollywood media target prabhas radheshyam movie badly
అయినా కూడా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయాలు చాలా నీరసంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రభాస్ కి సౌత్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారు అదే స్థాయిలో నార్త్ లో కూడా అభిమానులు ఉన్నారు. కనుక ఈ సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లను సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ అక్కడ వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇప్పుడు చాలా మందికి అనుమానంగా ఉంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చు అనే కామెంట్స్ చేస్తున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.