Star Hero : కూతురు వయసున్న ఆమెతో ఎఫైర్.. చీ చీ.. ఇంత నీచానికి దిగజారుతారని అనుకోలేదు..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: December 15, 2022, 11:30 am

Star Hero : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే కాదు ఎఫైర్స్ తో కూడా రెగ్యులర్ గా వార్తల్లో ఉంటాడు. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరితో డేటింగ్ చేసిన సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ని పట్టేశాడని అంటున్నారు. ముంబై మీడియా న్యూస్ ప్రకారం సల్మాన్ ఖాన్ తన ప్రస్తుతం చేస్తున్న సినిమా హీరోయిన్ పూజా హెగ్దేతో డేటింగ్ లో ఉన్నాడని టాక్. బాలీవుడ్ లో పూజా హెగ్దే ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు హిందీలో కూడా దూసుకెళ్తుంది.

సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పూజా హెగ్దే అతనితో ప్రేమలో పడిందని టాక్. ప్రస్తుతానికి సింగిల్ గా ఉన్న పూజా సల్మాన్ తో మింగిల్ అవడానికి రెడీగా ఉందట. అయితే సల్మాన్, పూజా డేటింగ్ న్యూస్ సల్మాన్ టీం దాకా వెళ్లడంతో వారు స్పందించారు. సల్మాన్ ఖాన్ పూజాల మీద వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. అయినా కూతురు వయసున్న హీరోయిన్ తో సల్మాన్ ఎలా డేటింగ్ చేస్తాడు.. అసలు మీకు కొద్దిగైనా సరే ఉండాలని అంటూ స్పందిస్తున్నారు.

bollywood star hero star heroine rumors clarity

bollywood star hero star heroine rumors clarity

సల్మాన్ తనతో నటించే హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. అలాంటిది ప్రతి ఒక్కరితో అతను డేటింగ్ చేస్తాడా అని అతని టీం అంటుంది. సల్మాన్ పూజా హెగ్దే కలిసి నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. పూజా హెగ్దే మాత్రం ఈ న్యూస్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. తెలుగులో వరుస క్రేజీ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న పూజా బేబీ బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది. ఈ టైం లో సల్మాన్ తో డేటింగ్ రూమర్స్ ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ పడేలా చేస్తాయని చెప్పొచ్చు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp