Bollywood : వావివరుసలు మరిచిన బాలీవుడ్‌.. సొంత వదినలు, మరదళ్లతో స్టార్ హీరోల రొమాన్స్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bollywood : వావివరుసలు మరిచిన బాలీవుడ్‌.. సొంత వదినలు, మరదళ్లతో స్టార్ హీరోల రొమాన్స్!

 Authored By mallesh | The Telugu News | Updated on :19 September 2022,8:00 am

Bollywood : సినిమా పరిశ్రమలు అన్నింటిలో బాలీవుడ్‌లో కాస్త బోల్డ్ నెస్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ బంధాలు, బంధుత్వాల కంటే రొమాన్స్, లవ్, ఎఫైర్స్ ముఖ్యమని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇక కాస్టింగ్ కౌచ్, నెపోటిజమ్ ఇలా అన్ని సమస్యలు బీటౌన్‌లోనే ఉంటాయి. ఖాన్‌ల కుటుంబాలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని కొత్త నటులకు అవకాశాలు లేకుండా చేస్తారని చాలా మంది నటీనటులు ఆరోపించారు. ఇక హిందీ సినిమాల్లో తమ వదినలు, మరదళ్లతో రొమాన్స్ చేయడం అక్కడ కామన్ అయిపోయింది. సినిమా అనేది కల్పితం. అయితే, నిజజీవితంలో ఉండే బంధాలు, బంధుత్వాలు, వావివరుసలు అనేవి సినిమాల్లో పెద్దగా పనికి రావని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

ఎందుకంటే సినిమానే కల్పితం అన్నప్పుడు.. ఇందులో ఎవరు ఎవరితో రొమాన్స్ చేసినా అది కూడా కల్పితమే కానీ నిజం కాదుగా అంటున్నారు.అందువల్లే వెండితెరపై ఏదైనా జరుగుతుంది. దానిని నిజజీవితంలో పొత్త పెట్టకూడదు. కథ డిమాండ్ చేస్తే ఎవరు ఎవరితో అయినా రొమాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. హిందీలో ఒకప్పుడు సల్మాన్ ఖాన్ పక్కన కరీనా కపూర్ బాలనటిగా చేశారు. సల్మాన్ చాలా సార్లు కరీనాను ఎత్తుకుని ఆటపట్టించేవారట..తీరా చూస్తే కొంతకాలనికి ఆమెతో ఏకంగా రొమాన్స్ చేశాడు. అది చూసి అంతా షాకయ్యారు. అందుకే కదా సినిమాను సినిమాలాగే చూడాలి గానీ పర్సనల్‌గా ఫీల్ అవ్వకూడదట.. బాలీవుడ్‌లో వదినలు,మరదళ్లతో రొమాన్స్ చేసిన స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

bollywood which has forgotten its succession

bollywood which has forgotten its succession

Bollywood : బడా హీరోల ఫ్యామిలీ లేడిస్‌తో రొమాన్స్

సల్మాన్ ఖాన్ తన మరదలు మలైకా అరోరాతో మున్నీ బద్నాం హుయి సాంగ్‌లో ఆడిపాడిన విషయం తెలిసిందే.మలైకా సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య.ప్రస్తుతం వీరు విడాకులు తీసుకున్నారు. ఇక అనిల్ కపూర్-శ్రీదేవి బాలీవుడ్ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. శ్రీదేవి అనిల్‌కు వదిన అవుతుంది. అనిల్ కపూర్ అన్న బోనీ కపూర్‌ శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, కరీనాను వివాహం చేసుకోకముందు ఆమె అక్క కరిష్మా కపూర్ తో సైఫ్ రొమాన్స్ చేశారు. అజయ్ దేవ్ గణ్-రాణి ముఖర్జీ ఆన్ స్క్రీన్ బెస్ట్ కపుల్. రాణి ముఖర్జీ వరసకు మరదలు అవుతుంది. అజయ్ దేవ్‌గణ్ భార్య కాజోల్‌కు రాణి ముఖర్జీ కజిన్ అవుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది