Box Office : బాక్సాఫీస్ వ‌ద్ద‌ మెంట‌లెక్కిస్తున్న సినిమా.. 5 రోజుల్లో రూ.2,700 కోట్ల కలెక్షన్లు.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Box Office : బాక్సాఫీస్ వ‌ద్ద‌ మెంట‌లెక్కిస్తున్న సినిమా.. 5 రోజుల్లో రూ.2,700 కోట్ల కలెక్షన్లు.. !

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్..

  •  Box Office : బాక్సాఫీస్ వ‌ద్ద‌ మెంట‌లెక్కిస్తున్న సినిమా.. 5 రోజుల్లో రూ.2,700 కోట్ల కలెక్షన్లు.. !

Jurassic World Rebirth  : ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ డైనోసార్ యాక్షన్ థ్రిల్లర్ ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ Jurassic World Rebirth Film బాక్సాఫీస్‌ను బద్ధలుకొడుతోంది. జూలై 2న ప్రపంచవ్యాప్తంగా, జూలై 4న India భారతదేశంలో విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి వారం నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,734 కోట్లు (అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం) వసూలు చేసి, గత రికార్డులన్నింటినీ తుడిచేసింది.

Box Office బాక్సాఫీస్ వ‌ద్ద‌ మెంట‌లెక్కిస్తున్న సినిమా 5 రోజుల్లో రూ2700 కోట్ల కలెక్షన్లు

Box Office : బాక్సాఫీస్ వ‌ద్ద‌ మెంట‌లెక్కిస్తున్న సినిమా.. 5 రోజుల్లో రూ.2,700 కోట్ల కలెక్షన్లు.. !

Jurassic World Rebirth  : వ‌సూళ్ల వ‌ర్షం

భారతీయ బాక్సాఫీస్ India Box Office ద‌గ్గ‌క‌ కూడా ఈ మూవీ మంచి పర్‌ఫార్మెన్స్ కనబరుస్తోంది. 1వ రోజు: రూ. 9 కోట్లు, 2వ రోజు: రూ. 13.5 కోట్లు, 3వ రోజు: రూ. 16 కోట్లు, 4వ, 5వ రోజులు కలిపి: రూ. 2.23 కోట్లు ఇలా మొత్తం (ఇప్పటివరకు): రూ. 41.23 కోట్లు రాబ‌ట్టింది. ఈ రికార్డులతో ఆమిర్ ఖాన్ తాజా హిట్ ‘సీతారే జమీన్ పర్’, అలాగే ‘మెట్రో ఇన్ డినో’ వంటి చిత్రాలను దాటి ముందుకెళ్తోంది.

రూ. 1,540 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, కేవలం 5 రోజుల్లోనే పెట్టుబడికి రెండింతల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ వసూళ్ల పరంగా హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన F1 సినిమాను దాటి, దాని ఆదాయాన్ని సగం కంటే ఎక్కువగా మించిపోయింది. గాడ్జిల్లా, ది క్రియేటర్ సినిమాలకు దర్శకత్వం వహించిన గారెత్ జేమ్స్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది