
Boyapati Srinu : బాలక్రిష్ణపై బోయపాటి శ్రీను కాంట్రవర్షియల్ కామెంట్స్ ..
Boyapati Srinu : శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో తేజ మార్ని తెరకెక్కించిన ‘ కోటబొమ్మాళి ‘ పిఎస్ సినిమా ఈనెల 24న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమానసినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ విద్య కొప్పినీడి నిర్మించారు. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ నిర్వహించింది సినిమా యూనిట్. సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కోట బొమ్మాళి పిఎస్ ప్రచార సభ పేరుతో హైదరాబాదులో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా బోయపాటి శ్రీను హాజరయ్యారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, ఈ వేడుకకు హాజరైన పెద్దలకు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోటబొమ్మాళి సినిమా గురించి చెప్పాలంటే లింగిడి లింగిడి పాట ప్రతి ఒక్కరికి చేరింది. ఈ పాట ప్రతి ఒక్కరి మైండ్ లోకి వెళ్ళింది. కాబట్టే ఈ పాట ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఒక డైలాగ్, విజువల్స్, పంచ్, టీజర్, ట్రైలర్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇక్కడ ట్రైలర్ తో పని లేకుండా ఈ పాట సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది.
ఈ సినిమా ఇప్పటికే సక్సెస్ కొట్టినట్లే. ఇక ఈ సినిమాలో తెలుగు అమ్మాయి జీవిత రాజశేఖర్ కూతురు శివాని నటించారు. ఆమె చూడటానికి సాఫ్ట్ గా ఉన్న చాలా మంచి నటి. ఆమెకు ఇప్పటిదాకా గర్వంగా చెప్పుకునే పాత్ర పడలేదు అది ఈ సినిమా ద్వారా నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఇక హీరో రాహుల్ స్టేజ్ మీద మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారు విజయ్ మాస్టర్ గారు వచ్చారు. మా గురువుగారు ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలో విజయ్ గారు ఫైట్ చేస్తూ ఉంటే ఆయన్ని చూస్తూ ఎదిగాం.. ఈరోజు ఇక్కడ ఉన్నం ఆయన ఇక్కడికి వచ్చి ఎమోషన్ ని తట్టుకోలేక లైట్లు పడుతున్నాయి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అని ఏమీ అనుకోవద్దు అన్నారు. అవి ఎమోషన్ లో వచ్చిన కన్నీళ్లు. రాహుల్ నీ తండ్రి పేరును నిలబెట్టాలి. ఆరోజే నువ్వు సక్సెస్ అయినట్లు. మీ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు అని బోయపాటి శ్రీను తెలిపారు
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.