
Boyapati srinu movie with hero ram not good for his next Allu Arjun movie
Allu Arjun : అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్న బోయపాటి శ్రీను అనూహ్యంగా రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ను దక్కించుకున్నాడు. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించిన బోయపాటి బొక్క బోర్లా పడ్డాడు. రామ్ చరణ్ ను సోషల్ మీడియాలో జనాలు ఒక ఆట ఆడుకునేల చేశాడు. రామ్ చరణ్ తల ఎత్తుకోలేకుండా కొన్ని సన్నివేశాలను ఆ సినిమా లో రామ్ చరణ్ తో చేసి బోయపాటి పరువు తీశాడు అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి క్రేజ్ దక్కించుకున్న బోయపాటి ఒక్క వినయ విధేయ రామ సినిమా తో మొత్తం పోగొట్టుకున్నాడు అంటూ విమర్శలు మొదలు అయ్యాయి.
వినయ విధేయ రామ సినిమా తర్వాత అవకాశాలు వస్తాయా లేదా అనుకుంటూ ఉండగా బాలయ్య అఖండ సినిమా ఆఫర్ ను ఇచ్చాడు. అఖండ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ అల్లు అర్జున్ తో సినిమా ను చేసే అవకాశం ను బోయపాటి దక్కించుకున్నాడు. బోయపాటి శ్రీను మరియు అల్లు అర్జున్ ల కాంబో కన్ఫర్మ్ అయ్యింది. దాన్ని అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు. అఖండ సినిమా విడుదల అయ్యింది.. పుష్ప పార్ట్ 2 సినిమా మొదలు అయ్యి విడుదల అయ్యేప్పటికి ఏడాది సమయం పడుతుంది. కనుక ఈ ఏడాది కాలంలో బోయపాటి ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుని రామ్ తో ఒక సినిమా ను ప్లాన్ చేశాడు. సమ్మర్ లో మొదలు పెట్టి కేవలం అయిదు నెలల్లో సినిమాను ముగించాలని భావిస్తున్నాడు.
Boyapati srinu movie with hero ram not good for his next Allu Arjun movie
రామ్ తో సినిమాను సింపుల్ అండ్ స్పీడ్ గా చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రయోగం కనుక వినయ విధేయ రామ సినిమా తరహా లో విఫలం అయితే అప్పుడు అల్లు అర్జున్ నుండి బోయపాటికి పెద్ద షాక్ తప్పక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ మరియు బోయపాటిల కాంబో సినిమాపై నీలి నీడలు కమ్ముకునే అవకాశం ఉంటుంది. కనుక రామ్ తో తీయబోతున్న సినిమా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ఉంటేనే బోయపాటి ఆ సినిమాను తీస్తే బెటర్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ తో సినిమా మిస్ చేసుకుంటే అంతకు మించి దురదృష్టం ఉండదు. కనుక బోయపాటి తస్మాత్ జాగ్రత్త.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.