Akhanda : అఖండ సినిమా కలెక్షన్ల లాభాల్లో దర్శకుడికి వాటా.. బోయపాటి శ్రీను భారీ స్కెచ్..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 11, 2021, 11:40 am

Akhanda : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా సూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. శ్రీకాంత్ ప్రతి నాయకుడిగా, ప్రగ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తి బాబులతో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను రూపొందించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ రెండూ సూపర్ డూపర్ హిట్ అయి భారీ వసూళ్లను కట్ట బెట్టాయి. ఇప్పుడు అఖండ చిత్రం కలెక్షన్లను చూస్తుంటే వసూళ్లు ఆ చిత్రాలను మించి పోయేలా కనిపిస్తున్నాయి.అఖండ తొలి వారం ముగిసేసరికి అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది.

ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటుంది. బాలయ్యకు తక్కువ మార్కెట్ ఉన్న నైజాంలో కూడా అఖండ సినిమా రు 9.5 కోట్లకు అమ్మారట. అయితే తొలి వారం ముగిసే సరికి అక్కడ ఈ చిత్రం… ఏకంగా 14.5 కోట్ల షేర్ కొల్లగొట్టి నిర్మాతలకు, బయ్యర్లకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా… అఖండ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడనే దానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ అంశం చక్కర్లు కొడుతోంది.టాలివుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లుగా పేర్కొనే కొంతమంది ఒక్కొ సినిమాకు కనీసం రు. 15 కోట్ల నుంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ లాంటి వాళ్లు ఏకంగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు.

Boyapati Srinu taking shares in akhandam ovie collections news  went viral in social media

Boyapati Srinu taking shares in akhandam ovie collections news  went viral in social media

 Akhanda : లాభాల్లో బోయపాటి శ్రీను వాటా..!

రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయరామ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో బోయపాటితో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. దీంతో సినిమాకు 5 కోట్లు తీసుకునే బోయపాటి శ్రీనుకి ఈ మూవీకి అంత ఇవ్వలేమని నిర్మాతలు చెప్పారట. ఆ కారణంగా రెమ్యున‌రేష‌న్‌ తీసుకోని బోయపాటి… నిర్మాత నుంచి తన ఖర్చులను మాత్రమే తీసుకుని.. సినిమా హిట్ అయితే లాభాల్లో షేర్ తీసుకుంటానని నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే అనుకున్నట్టుగానే మూవీ భారీ సక్సెస్ కావడంతో ఇప్పుడు బోయపాటికి రూ. 10 కోట్లకు పైగా ముట్టనుందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp