Brahmamudi 16 Sep Today Episode : ముక్కలు అవుతున్న దుగ్గిరాల ఫ్యామిలీ.. అపర్ణ వేరు కాపురం.. రాజ్ ఒప్పుకుంటాడా? కావ్య ఏం చేస్తుంది?

Brahmamudi 16 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 16 సెప్టెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 203 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సొంత కొడుకు కూడా కావ్యనే సపోర్ట్ చేయడం అపర్ణకు నచ్చలేదు. అలాగే.. ఇంట్లో వాళ్లు కూడా తనదే తప్పు అన్నట్టుగా అపర్ణను నిందించడంతో అపర్ణకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఇక తనకు తానే బహిష్కరించుకుంటుంది. నువ్వు నన్ను మమ్మీ అని కూడా పిలవకు అని రాజ్ తో అంటుంది. అస్సలు నువ్వు నాతో మాట్లాడొద్దు అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. నీ భార్యకే కిరీటం పెట్టు. నేనెందుకు ఇక అంటూ అరుస్తుంది అపర్ణ. కావ్యే కరెక్ట్.. అంటే నేను తప్పు అనే కదా.. నన్నే తప్పు పట్టారు కదా అంటూ కోపంతో తన గదిలోకి వెళ్లిపోతుంది అపర్ణ. ఇంకో వైపు కనకం.. స్వప్న గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. తన కాల్ అస్సలు కలవదు. అక్కడ సిగ్నల్ సరిగ్గా లేదేమో అని అందరూ అంటారు. దీంతో కనకానికి ఏం చేయాలో అర్థం కాదు.

#image_title

కట్ చేస్తే అపర్ణ దగ్గరికి రుద్రాణి వెళ్లి ఇంకా అపర్ణను రెచ్చగొట్టాలి అని అనుకుంటుంది. అసలు నిన్ను అందరూ అలా నిలదీస్తుంటే నాకే కోపం వచ్చింది. అంటే.. నీకు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కావ్యను కొట్టాల్సింది పోయి రాజ్ ఏంటి నీకే ఎదురు చెప్పాడు. నిన్ను కాదని కావ్యకు సపోర్ట్ చేశాడు.. అంటూ ఇంకా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఇంట్లో వాళ్లంతా నిన్ను కాదని కావ్యనే నమ్ముతున్నారు. ఇలాగే ఇది కంటిన్యూ అయితే కావ్య ఏం అనుకుందో అదే జరుగుతుంది.. అప్పుడు ఇక నీకే కష్టం అంటూ మరో రాయి వేసి వెళ్తుంది రుద్రాణి.

Brahmamudi 16 Sep Today Episode : స్వప్న ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పడ్డ కనకం

అపర్ణ గురించే కావ్య ఆలోచిస్తూ ఉండగా కృష్ణమూర్తి ఫోన్ చేస్తాడు. ఇంటికి వస్తా అన్నావు కదా అమ్మ అని కృష్ణమూర్తి అంటాడు. దీంతో సరే బయలుదేరుతా అంటుంది కావ్య. రాత్రి బాగా వర్షం పడింది. విగ్రహాలు ఆరలేదు. అందుకే ఇవాళ రావాల్సిన అవసరం లేదు అంటాడు కృష్ణమూర్తి. దీంతో సరే నాన్న.. రేపు వస్తాను అంటుంది కావ్య. ఆ తర్వాత స్వప్న గురించి కూడా చెబుతాడు. దీంతో నా ఫోన్ కూడా కలవడం లేదు అంటుంది కావ్య.

ఇక.. రాజ్ కూడా తల్లి అపర్ణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన తల్లి దగ్గరికి వెళ్లగా.. రాజ్ ను చూసి అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మమ్మీ అని పిలిస్తే ఎవరు అంటూ కోపంగా మాట్లాడుతుంది అపర్ణ. నాతో మాట్లాడవా అంటే.. ఇప్పటి వరకు నీతో మాట్లాడింది చాలు.. విన్నది చాలు.. చూసింది చాలు.. నీ భార్య మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు కదా. ఇక హాయిగా కాపురం చేసుకోండి.. ఈ ఇంట్లో నిన్ను అడిగే వాళ్లు ఎవరు అంటూ అపర్ణ మాట్లాడుతుంది. నాకు ఈ ఇంట్లో నీకంటే ఎవ్వరూ ఎక్కువ కాదు మమ్మీ అంటాడు రాజ్. అది నీ భార్యకు చెప్పు నాకు కాదు అంటుంది అపర్ణ.

నువ్వు ఏం చెప్పినా నమ్మను. నా కడుపు రగిలిపోతోంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒక్కగానొక్క కొడుకువి. కానీ.. ఇలా చేస్తావనుకోలేదు. ఆ కుటుంబాన్నే నువ్వు నెత్తిన పెట్టుకున్నావు. నీ జీవితం ఇలా మారిపోయింది.. ఆ మనిషి కోసమే నువ్వు నీ కన్నతల్లినే ఎదిరించే స్థాయికి వెళ్లావు. నేను ఒంటరిని అయ్యాను. నన్ను ఏరోజు కూడా ఎవ్వరూ తప్పుపట్టలేదు కానీ.. నేను ఈరోజు మీ వల్ల నాకు ఆ సత్కారం జరిగింది. నువ్వు ఎన్ని చెప్పినా.. నాకు ఈ లోకంలో నీ తర్వాతే ఎవరైనా అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్.

కట్ చేస్తే.. కళ్యాణ్.. అప్పును కలుస్తాడు. అనామిక ఇంటికి వచ్చిందని చెబుతాడు. దీంతో అప్పు అతడి మీద సెటైర్లు వేస్తుంది. అనామికకు తన ప్రేమ విషయం ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతుంటాడు. ఇక.. ఇంట్లో తన వంట తానే చేసుకుంటుంది అపర్ణ. ఇంట్లో వాళ్లు అది చూసి షాక్ అవుతారు. అదేంటి నీ వంట నువ్వే చేసుకుంటున్నావు. వేరు కాపురం పెడతావా? అని ధాన్యలక్ష్మి అంటుంది. దీంతో అవును అన్నట్టుగా తల ఊపుతుంది రుద్రాణి. కావ్య దగ్గరికి వెళ్లి నువ్వు చేసిన పనికి తల్లీకొడుకులు దూరం అయ్యారు అంటుంది రుద్రాణి.

కట్ చేస్తే.. రాత్రి అయ్యాక గదిలో ఉన్న అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. అత్తయ్య గారు అని పిలిచినా అపర్ణ మాత్రం పట్టించుకోదు. దీంతో ఒక అడుగు వెనక్కి వేస్తుంది కావ్య. లోపలికి రావచ్చా అత్తయ్య గారు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. అని చెప్పబోతుండగా మొహం మీదనే తలుపులు వేస్తుంది. ఇక.. తన వంట తానే వండుకొని తింటుంటే.. వేరే కాపురం పెట్టండి.. ఆస్తులు పంచుకోండి అని అపర్ణతో ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే వారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

3 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

5 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

9 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

12 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

15 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago