Brahmamudi 2 Oct Monday Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 2 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 216 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే వెళ్లి వాళ్ల అంతు చూస్తాను అని ఆవేశపడతాడు రాహుల్. దీంతో అంత అవసరం లేదు రాహుల్.. వాళ్లను పోలీసులకు పట్టించాం అంటుంది కావ్య. అలాంటి వాళ్లను ఉప్పుపాతర వెయ్యాలి. వాడికి అలాంటి ఆలోచన వచ్చిన వాడిని అనాలి అంటూ ఇందిరా దేవి సీరియస్ అవుతుంది. అసలు వాడికి అలాంటి సలహా ఇచ్చిన వాడిని ఏం చేసినా పాపం లేదు అని ఇంట్లో వాళ్లంతా అంటారు. ఆ తర్వాత స్వప్నకు ఏం కాకుండా కాపాడుకున్నాం. ఆ వినాయకుడికి రేపు పూజలు చేద్దాం అంటుంది ఇందిరాదేవి. ఆ తర్వాత రాహుల్.. స్వప్నను తన రూమ్ లోకి తీసుకెళ్తాడు. మరోవైపు రాహుల్ చెంప చెళ్లుమనిపిస్తుంది రుద్రాణి. ఒక్క పని కూడా సరిగ్గా చేయవా అని సీరియస్ అవుతుంది. విగ్రహాల విషయంలో అలా చేశావు. ఇప్పుడు స్వప్న విషయంలో ఇలా.. అంటూ రాహుల్ పై విరుచుకుపడుతుంది.
నిన్ను అందలం ఎక్కించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగడం లేదు అని బాధపడుతుంది. ఇది మిస్ అవకూడదు.. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని ఎన్నిసార్లు చెప్పాను. కానీ.. తల పగులగొట్టుకొని వచ్చావు అంటుంది రుద్రాణి. ఆ మైఖేల్ గాడి వల్లనే ఇలా జరిగింది అంటాడు. దీంతో నువ్వు ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే ఆ కంపెనీకి నువ్వు రాజు కాదు కదా.. బంటువి కూడా కాలేవు అంటుంది రుద్రాణి. తప్పు జరిగిన ప్రతి సారీ ఆ కావ్య మరింత జాగ్రత్తగా ఉంటోంది. మన దగ్గర ఎక్కువ టైమ్ లేదు. స్వప్న కడుపుతో ఉంది. ఆరో నెల వస్తే కనకం వచ్చి పుట్టింటికి తీసుకెళ్తా అంటుంది. శ్రీమంతం అంటుంది. చివరకు మన చేతుల్లో బాబునో, పాపనో పెడుతుంది. అప్పుడు మనం చేసేది ఏం ఉండదు అంటుంది రుద్రాణి. ఇక అవకాశం కోసం ఎదురు చూడకూడదు.. మనమే ఏదో ఒక దారిని వెతకాలి.. ఆ స్వప్నను వదిలించుకోవాలి అని అంటుంది రుద్రాణి.
మరోవైపు కావ్య.. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. మైఖేల్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకుంటుంది కావ్య. ఇంతలో శ్రీను వస్తాడు. మీరు చేసిన హెల్ప్ వల్లే అనుకున్న పని అనుకున్నట్టు పూర్తయింది అంటాడు. చెక్ ఇవ్వడానికి వచ్చాను అంటాడు శీను. కావ్యకు చెక్ ఇచ్చి వెళ్తాడు శీను. చెక్ చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. మార్వాడి వాడికి మీరే చెక్ ఇచ్చి మీ చేతుల మీదుగానే ఇంటి పేపర్లు మా అమ్మానాన్నకు ఇవ్వాలి అని రాజ్ ను అడుగుతుంది. దీంతో ఇవన్నీ నాకెందుకు అంటే.. మీరే చేయాలి అంటుంది. ఆ మార్వాడికి ఫోన్ చేసి రమ్మని చెబుతా అంటుంది కావ్య.
నేను ఇదంతా తన మీద ప్రేమతో చేశానని అనుకుంటోంది కళావతి. కాదు.. తాతయ్య కోసం చేశాను అని తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో అని అనుకుంటాడు రాజ్. మరోవైపు అనామికతో కలిసి కారులో వెళ్తుంటాడు కళ్యాణ్. మీతో కలిసి ఉంటే అస్సలు టైమ్ తెలియడం లేదు అంటుంది అనామిక. రేపు వినాయకచవితి కదా. మా పేరెంట్స్ ను మీ ఇంటికి తీసుకొస్తా.. అంటుంది అనామిక. దీంతో షాక్ అవుతాడు కళ్యాణ్. ఏం కాదు.. అని కళ్యాణ్ కు సర్దిచెబుతుంది అనామిక.
మరోవైపు స్వప్నకు ఇంత జరిగితే నాకు చెప్పవా అని అప్పు.. కనకంపై సీరియస్ అవుతుంది. సమయానికి అక్క, బావ వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వేం చేసేదానివి అని అడుగుతుంది అప్పు. నా కూతురు సంతోషంగా ఉండాలని గొప్పింటికి ఇచ్చాను కానీ.. నా కూతురు నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటుంది కనకం. మరోవైపు అప్పుకు కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. దీంతో అవసరం ఉంటే కాల్ చేస్తడా అని ఫోన్ కట్ చేస్తుంది అప్పు. దీంతో మళ్లీ చేస్తాడు. కట్ చేస్తుంటే అర్థం కావడం లేదా.. బిజీ బిజీగా ఉన్నానని.. మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే.. అది కాదు అనామిక అంటూ ఏదో చెప్పబోతాడు. దీంతో నువ్వు, అది కలిసి హుస్సేన్ సాగర్ లో దూకినా.. నాగార్జున సాగర్ ఎక్కినా నాకు అవసరం లేదు అని ఫోన్ కట్ చేస్తుంది.
కట్ చేస్తే కనకానికి.. కావ్య ఫోన్ చేస్తుంది. ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి అని అడుగుతుంది కనకం. నువ్వే కదా కాపాడింది అని అంటుంది కావ్య. శీను డబ్బులు ఇచ్చాడని చెబుతుంది కావ్య. దీంతో ఇదంతా అల్లుడి గారి చలవే అంటుంది కనకం. ఇంటి పేపర్స్ మీ అల్లుడి గారి చేతుల మీదుగా ఇప్పిస్తాను. ఇంటికి రండి అంటుంది కావ్య. అక్కడికి ఎందుకు అంటుంది కనకం.
మా అత్త గారు పిలిస్తే నీకు ఓకేనా అంటుంది కావ్య. దీంతో ఇదంతా అవసరమా చెప్పు అంటుంది కనకం. అది కాదు కావ్య అంటే కూడా వినదు కావ్య. అత్తయ్యను ఏం చెప్పి ఒప్పించాలి అంటూ టెన్షన్ పడుతుంది కావ్య. అందరూ రాత్రి డిన్నర్ తింటూ ఉంటారు. అత్తయ్య గారు మీరు కర్రీ వేయనా.. పచ్చడి వేయనా అని అడుగుతుంది కావ్య. దీంతో చాలు అంటున్నా కదా అంటూ సీరియస్ అవుతుంది అపర్ణ. మీకో విషయం చెప్పాలి. ఒక్కసారి రేపు రాజ్ ను తీసుకొని మా పుట్టింటికి వెళ్తాను అత్తయ్య అంటుంది కావ్య. కొంచెం పని ఉంది అంటుంది. దీంతో కాంట్రాక్ట్ పని పూర్తయింది కదా. మళ్లీ ఏంటిది అని అడుగుతుంది.
కాంట్రాక్ట్ మీ అబ్బాయి వల్లే వచ్చింది కాబట్టి.. ఆ ఇంటి పత్రాలు కూడా మీ అబ్బాయి చేతుల మీదుగానే ఇప్పించాలని అనుకుంటున్నాను అంటుంది కావ్య. అందుకని రాజ్ ను తీసుకొని వెళ్తావా? కుదరదు అంటుంది అపర్ణ. మరి నన్ను ఏం చేయమంటారు అత్తయ్య. మా అమ్మ ఏమో ఇక్కడికి రమ్మంటే రాను అంటోంది. మీరేమో పంపించను అంటున్నారు అంటుంది. కనకాన్ని పిలిస్తే ఎందుకు రాదు అంటుంది అపర్ణ. మరోవైపు ఇంట్లో వినాయకచవితి సంబురాలు మొదలవుతాయి. అందరూ తమ మనసులోకి కోరికలను చిట్టీలుగా రాసి దేవుడి వద్ద పెడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.