Brahmamudi 22 Sep Today Episode : కనకం ఫ్యామిలీకి మళ్లీ కష్టాలు.. విగ్రహాలన్నీ ఎత్తుకెళ్లారు.. ఈ పని చేయించింది రుద్రాణి అని తెలిసి కావ్య, రాజ్ ఏం చేస్తారు?

Brahmamudi 22 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి సీరియల్ 22 సెప్టెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 208 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కావ్యను తీసుకెళ్లడానికి మూర్తి ఇంటికి వెళ్తాడు రాజ్. నా పని ఇంకా పూర్తి కాలేదు. పనయ్యాక వస్తా అంటుంది కావ్య. సరే నేను వెయిట్ చేస్తా అంటాడు. మరోవైపు మూర్తి విగ్రహాల దగ్గరికి వెళ్తాడు. ఇంతలో విగ్రహాలు ఎత్తుకెళ్లడానికి కొందరు మనుషులు వస్తారు. ఇంతలో మూర్తి రావడం చూస్తారు. వాటిని ఎత్తుకెళ్లేలోపు మూర్తి రావడంతో కాసేపు ఆగుదాం అని అనుకుంటారు. మూర్తి విగ్రహాలన్నింటినీ చూస్తుంటాడు. విగ్రహాలు దొంగలిద్దామంటే ఈ ముసలోడు ఉన్నాడేంటి అని అనుకుంటాడు దొంగలు. మరోవైపు రాజ్ కాఫీ తాగుతూ కావ్యను చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అంటుంది కావ్య. ఏం చూడకూడదా అంటాడు రాజ్.

#image_title

మీరు ఎక్కువగా ప్రతిదీ ప్రశ్నలగానే అడుగుతారు. అత్తయ్య మీరు కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రశ్నలు చదివేవారు కావచ్చు అంటూ ఎటకారంగా మాట్లాడుతుంది. ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా.. ఈ రోజు రాత్రి మొత్తం మీరు ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది. దీంతో అదేంటి వర్క్ అయిపోతుంది అన్నావు కదా అంటే.. ఈరోజుతో అయిపోతుంది. ఈ కాంట్రాక్ట్ మీవల్లే వచ్చింది కాబట్టి మీ చేతితోనే గుమ్మడికాయ కొట్టించి పని పూర్తి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా అంటుంది కావ్య. దీంతో సరే కానియ్ అంటాడు రాజ్. దీంతో కావ్య సంతోషిస్తుంది.

Brahmamudi 22 Sep Today Episode : కావ్య ఇంకా రాలేదని కోపంతో ఉన్న అపర్ణ

మరోవైపు అపర్ణ ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో సీతారామయ్య వస్తాడు. ఏంటమ్మా ఇంకా పడుకోలేదు అంటాడు. దీంతో మీ మనవరాలు ఇంటికి వెళ్లి ఇప్పటి వరకు రాలేదు అంటే.. నాకు ఫోన్ చేసి చెప్పింది.. లేట్ అవుతుందని అంటాడు సీతారామయ్య. దీంతో మీరు కావ్యకు సపోర్ట్ చేయడం మానేయండి. పుట్టింటి విషయాల్లో కావ్యకు మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పూర్తయితే మీరు కావ్యను వెనకేసుకురావడం ఆపాలి అంటుంది అపర్ణ.

దీంతో కంగారు పడకమ్మా.. కావ్యను తీసుకురావడానికి రాజ్ వెళ్లాడు అంటాడు. ఇంతలో సీతారామయ్య.. కావ్యకు ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఇంకా రాలేదు అని అడుగుతాడు. దీంతో అయ్యో తాతయ్య ఈరోజు రావడం కుదరదు. ఈరోజుతో కాంట్రాక్ట్ పూర్తవుతుంది కదా.. నా చేతులతో కాంట్రాక్ట్ పూర్తి చేద్దామని అనుకుంటున్నారు.. అంటాడు. దీంతో సరే మంచి నిర్ణయం అంటాడు సీతారామయ్య. అపర్ణకు ఈ విషయం నచ్చదు. రుద్రాణి ఇదంతా విని వెంటనే రాహుల్ కు ఫోన్ చేస్తుంది.

ఆ రాజ్ కూడా కావ్య దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమైనా ప్లాన్ చేస్తే రాజ్ అడ్డుకోవచ్చు అంటుంది. దీంతో ఏమైనా కానీ.. మనవాళ్లు రాజ్ కి కూడా నాలుగైదు అంటిస్తారు. ఎక్కువ చేస్తే కాళ్లు చేతులు కూడా తీసేస్తారు. అది మనకు మంచిదే కదా అంటాడు. ఏం జరిగినా ఆ విగ్రహాలు మాత్రం తెల్లారేసరికి మాయం కావాలి అంటుంది రుద్రాణి. మరోవైపు కనకం నిద్రపోకుండా ఇంటి ముందు కూర్చొని ఉంటుంది. ఏంటమ్మా నిద్రపోలేదు అని అడుగుతుంది కావ్య.

దీంతో నిద్రపట్టడం లేదు అంటుంది కనకం. ఇప్పుడు అంతా ఓకే కదా అంటే.. ఇది ఆనందంలో రాని నిద్ర. ఈ విషయంలో మీ ఆయనను మెచ్చుకోవాలి. మీ ఆయన సపోర్ట్ లేకపోతే మనం ఇంత పెద్ద కాంట్రాక్ట్ చేసేవాళ్లమే కాదు. ఆయన నిన్ను పంపించకపోతే అనుకున్న విధంగా విగ్రహాలు పూర్తయ్యేవి కావు అంటుంది. దీంతో అవన్నీ రాజ్ వింటాడు. ఇంతలో అప్పు లేచి వస్తుంది. అందరూ కలిసి కూర్చొని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.

ఇంతలో అప్పు క్యాంప్ ఫైర్ వేస్తుంది. అందరూ అక్కడ కూర్చొని చలికాచుకుంటూ ఉంటారు. అందరూ సరదాగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. మరోవైపు మూర్తిని కొట్టి రాహుల్ పంపించిన దొంగలు విగ్రహాలను ఎత్తుకెళ్తారు. ఉదయమే అక్కడికి వెళ్లిన కావ్య, కనకం మూర్తిని ఆ పరిస్థితిలో చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

2 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

4 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

16 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

19 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

23 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 day ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago