
#image_title
Brahmamudi 25 Sep Monday Episode Highlights : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. బ్రహ్మముడి సీరియల్ 25 సెప్టెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 210 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్యాన్లను ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్తారు. మరోవైపు వ్యాన్ల కోసం అటు రాజ్.. ఇటు అప్పు తన ఫ్రెండ్స్ తో కలిసి వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అప్పు ఫ్రెండ్ గండిపేట్ చెరువు దగ్గర వ్యాన్లు కనిపించాయి అని చెబుతాడు. దీంతో అప్పు వెంటనే అక్కడికి బయలుదేరుతుంది. ఇంతలో సతీష్ అనే వ్యక్తి కూడా రాజ్ కి ఫోన్ చేసి ఆ విగ్రహాలు గండిపేట్ చెరువు దగ్గర ఉన్నాయని చెబుతాడు. దీంతో రాజ్ కూడా గండిపేట్ చెరువు దగ్గరికి బయలుదేరుతాడు. అంతలో అక్కడికి అప్పు తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుంది. వాళ్లందరినీ చితకబాదుతుంది అప్పు.
#image_title
మరోవైపు మూర్తి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రాజ్ కూడా అక్కడికి వెళ్తాడు. అప్పుపై వాళ్లు తిరిగి దాడి చేయబోతుండగా రాజ్ అడ్డుకుంటాడు. అందరినీ చితకబాదుతాడు. అందరినీ కొడుతాడు. దీంతో సార్ మమ్మల్ని క్షమించండి సార్ అంటారు. తప్పు చేస్తే క్షమించే వాడు దేవుడు అవుతాడురా.. మరి శిక్షించేవాడు ఎవడు.. అంటూ విగ్రహాలను ఎందుకు ఎత్తుకొచ్చారు. మిమ్మల్ని ఎవరు పంపించారు.. అంటూ అడుగుతాడు. దీంతో అసలు విషయం చెప్పకుండా డబ్బుకోసమే ఇదంతా చేస్తున్నాం అంటారు. కానీ.. రాజ్ నమ్మడు. వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి అసలు విషయం చెబుతాడు.
వెంటనే వ్యాన్లలో విగ్రహాలను తీసుకొని రాజ్, అప్పు ఇద్దరూ అక్కడికి వస్తారు. విగ్రహాలను చూసి కావ్య, మూర్తి షాక్ అవుతారు. మీ విగ్రహాలు దొరికేశాయి అంటాడు రాజ్. దీంతో చాలా ఖుషీ అవుతాడు మూర్తి, కావ్య. శీను కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు. కావ్య అయితే రాజ్ ని హత్తుకుంటుంది. నా కోసం మీరు ఇంత చేస్తారని నేను అస్సలు అనుకోలేదండి.. అంటూ గట్టిగా హత్తుకుంటుంది కావ్య.
తర్వాత మూర్తిని ఇంటికి తీసుకెళ్తారు. మరోవైపు స్వప్న పెట్టుడు కడుపును సెట్ చేసుకుంటుంది. మొత్తానికి నేను రాహుల్ ను బయటికి తీసుకొచ్చిన పని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. ఇంటి దగ్గర కూడా అందరినీ ఈజీగా నమ్మించాలి అని అనుకుంటుంది స్వప్న. రాహుల్ ను పిలిచి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది స్వప్న.
ఈరోజు మీరు చేసిన సాయానికి నేను మీకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను అని రాజ్ కి మరోసారి థాంక్స్ చెబుతుంది కావ్య. తమరు మాకు తెలియకుండానే డిజైన్స్ వేశారు కదా అని అంటాడు రాజ్. ఆ సాయానికి బదులుగా ఈ సాయం చేశాను అంటాడు రాజ్. సాయం అనుకునే వాళ్లను ఎదురించి పోరాడారా అంటుంది కావ్య. దీంతో నాలాంటి ధైర్యవంతులకు అది చాలా మామూలు విషయం అంటాడు రాజ్. ఇంతలో అక్కడికి బొద్దింక రావడంతో దాన్ని చూసి షాక్ అవుతు. భయపడతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.