Brahmamudi 27 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 సెప్టెంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 212 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా డబ్బులు ఎప్పుడు తీర్చుతారని కనకం, మూర్తిపై చంపక్ లాల్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీంతో చంపక్ లాల్ చొక్కా పట్టుకొని మరీ కనకం సీరియస్ అవుతుంది. దీంతో నన్నే బెదిరిస్తారా.. రెండు రోజుల్లో డబ్బులు కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేస్తా అని చంపక్ లాల్ సీరియస్ అవుతాడు. దీంతో కనకం, మూర్తికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు అప్పును కళ్యాణ్ కలుస్తాడు. దీంతో కోపంతో అప్పు కళ్యాణ్ కు కర్రతో కొడుతుంది. ఎందుకురా ఇంత బిజీ అయ్యావు అంటూ కోపంతో రగిలిపోతుంది. అనామిక గురించి చెప్పినా కూడా వినదు. అనామికతో తన ప్రేమ గురించి మాట్లాడటానికి వెళ్లానని.. కానీ తను మాత్రం ఏకంగా పెళ్లి కార్డును ఇచ్చిందని చెబుతాడు. కానీ.. కళ్యాణ్ చెప్పేవేవీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పు.
మరోవైపు స్వప్నను రాహుల్ ఒక చోటుకు తీసుకెళ్లి రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంతలోనే అక్కడికి మైఖేల్ వచ్చి రాహుల్ ను కొట్టి స్వప్నను ఎత్తుకెళ్తాడు. తనను కిడ్నాప్ చేస్తాడు. ఆసుపత్రిలో చేరిన రాహుల్.. దుగ్గిరాల ఫ్యామిలీకి జరిగిన విషయం చెబుతాడు. దీంతో వెంటనే అందరూ రాహుల్ ను చూడటానికి ఆసుపత్రికి వెళ్తారు. అప్పుడు స్వప్న కిడ్నాప్ అయిందన్న విషయం చెబుతాడు రాహుల్. కానీ.. ఇదంతా కావాలని రుద్రాణి, రాహుల్ ఆడిస్తున్నా నాటకం అని ఎవ్వరూ తెలుసుకోలేకపోతారు. స్వప్న కూడా ఆ విషయం తెలుసుకోలేకపోతుంది.
మరోవైపు కావ్య విషయంలో రాజ్ ప్రవర్తన మారడంతో సీతారామయ్య, ఇంద్రాదేవి సంతోషం వ్యక్తం చేస్తారు. ఇంత త్వరగా రాజ్ మారుతాడని వాళ్లు అనుకోలేదు. ఉదయం కూడా కావ్యతో కలిసి రాజ్ స్కిప్పింగ్ చేయడం చూసి సీతారామయ్య చాలా సంతోషిస్తాడు. మొత్తానికి నా మనవడు మారాడని.. కావ్యతో సంతోషంగా ఉంటున్నాడని ఇద్దరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తారు.
కానీ.. రాజ్ కావ్యతో సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడని.. నిజంగా రాజ్ కి కావ్య అంటే ఇష్టం లేదని.. తన తాతయ్య సంతోషం కోసం, ఆయనకు క్యాన్సర్ ఉన్నందున ఇప్పుడు ఆయన్ను బాధపెట్టకూడదని రాజ్ కావ్యతో సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు.
ఆ విషయం సీతారామయ్యకే కాదు.. కావ్యకు కూడా తెలియదు. కావ్య కూడా రాజ్ తనను నిజంగానే సంతోషంగా చూసుకుంటున్నాడు.. తనతో బాగుంటున్నాడు అని భావిస్తుంది. కానీ.. కావ్యకు కూడా కేవలం తాతయ్య సంతోషం కోసమే తనతో బాగుంటున్నాడు అనేది తెలియదు.
ఇక.. మరోవైపు స్వప్న కిడ్నాప్ విషయంలో కావ్యకు డౌట్ వస్తుంది. అసలు స్వప్పను ఎవరు కిడ్నాప్ చేశారు. రాహుల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని రాహుల్ మీద డౌట్ వస్తుంది కావ్యకు. స్వప్న కిడ్నాప్ విషయాలన్ని ఎలాగైనా తేల్చేయాలని అనుకుంటుంది కావ్య. అసలే కడుపుతో ఉన్న స్వప్నను ఎవరు కిడ్నాప్ చేశారు.. ఎవరికి అంత అవసరం వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Weight Loss : ప్రస్తుత సమాజంలో నానాటికి అధిక బరువు Weight Loss అనే సమస్య పెరుగుతూనే ఉంది. ప్రతి…
Loans : ఈ రోజుల్లో చాలా మంది కూడా లోన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్…
Health Tips : మనం ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా boiled food ఉడికించిన…
Mirror : ఇంట్లో ఎన్నిసార్లు పొరపాట్ల వల్ల అద్దం పగిలిపోతూ ఉంటుంది. కొన్ని వస్తువులు కూడా పగిలిపోతూ ఉంటాయి. కొంతమంది…
Tea Powder : నేను ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. ఇది నీ ఉదయాన్నే లేచిన వెంటనే వేడివేడిగా ఒక…
Zodiac Signs : 2025 మార్చి 29న శని దేవుడు కుంభరాశిలోనికి ప్రవేశించనున్నాడు. Zodiac Signs మీన రాశిలోకి అప్పటికే…
Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో కాస్త ఫాం కోల్పోయినా బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది.…
Vizag Steel Plant : ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా ఆంధప్రదేష్ andhra pradesh అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి…
This website uses cookies.