#image_title
Brahmamudi 28 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 28 సెప్టెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 213 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాహుల్ ను చూడటానికి అందరూ హాస్పిటల్ కు వస్తారు. అక్కడ రాహుల్ ను తెగ ప్రశ్నలు వేసి విసిగిస్తుంది కావ్య. దీంతో ఎక్కడ దొరికిపోతామో అని రుద్రాణి టెన్షన్ పడుతుంది. అసలు నువ్వు కూకట్ పల్లికి ఎందుకు వెళ్లావు. అక్కడికి ఎందుకు వెళ్లారు.. చెప్పు రాహుల్ అంటూ కావ్య ప్రశ్నిస్తుంది రాహుల్ ను. వామ్మో.. ఇదేదో మా మీదికి వచ్చేలా ఉందని అనుకుంటుంది రుద్రాణి. రాహుల్ కూడా తనకు తలనొప్పి వస్తున్నట్టు నటిస్తాడు. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు.. కిడ్నాప్ చేసిన వాళ్లను చూశావా అని అడుగుతుంది కావ్య. దీంతో తనకు నొప్పిగా ఉన్నట్టు నటిస్తుంటాడు. దీంతో పేషెంట్ ను డిస్టర్బ్ చేయకండి అని డాక్టర్ చెబుతారు. దీంతో ఇబ్బంది ఏంటి.. అక్కడ మా అక్క కిడ్నాప్ అయింది. ఇబ్బంది అంటారేంటి.. సైలెంట్ గా ఎలా ఉండమంటారు అని డాక్టర్ పై కూడా అరుస్తుంది కావ్య. దీంతో మీ ఇష్టం అని డాక్టర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీంతో రుద్రాణి కల్పించుకొని స్వప్న నీకు అక్క మాత్రమే కాదు.. నాకు కోడలు కూడా. ముందు రాహుల్ రికవరీ అవ్వనీ. ఆ తర్వాత చూద్దాం అంటుంది రుద్రాణి. అయినా కూడా కావ్య వినదు. దీంతో రాజ్ కూడా కావ్యకు సర్దిచెబుతాడు. రాజ్ కావ్యను పక్కకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత సుభాష్ కూడా పక్కకు వెళ్లడంతో రాహుల్ లేచి కూర్చొంటాడు. స్వప్న కిడ్నాప్ అయిందని తెగ సంబురపడిపోతుంటాడు. ఇంతలో మైఖేల్ కు ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే దండలు కొంటున్నాం అని చెబుతాడు మైఖేల్. దీంతో ఎందుకు అని అడుగుతాడు రాహుల్. స్వప్నను చంపేశాం. దండలు వేద్దామని వచ్చాం అంటాడు మైఖేల్. దీంతో ఏది వీడియో కాల్ చేయి అని రాహుల్ అడుగుతాడు. దీంతో మేము శవం దగ్గర లేము.. బయట ఉన్నాం అంటాడు మైఖేల్. ఎవ్వరికీ తెలియకుండా పాతిపెట్టేస్తాం అంటాడు మైఖేల్. వద్దు.. స్మశాన వాటికలో పాతిపెట్టండి అంటాడు రాహుల్. ఆ తర్వాత నువ్వు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపో అని మైఖేల్ కి చెబుతాడు రాహుల్.
#image_title
అండర్ గ్రౌండ్ కాదు.. అండమాన్ కే వెళ్లిపోతాం. నీకు కూడా కనిపించమన్నా కనిపించం అని చెబుతాడు మైఖేల్. కట్ చేస్తే అక్కడే కనకం కూడా ఉంటుంది. తనకు ఏ దండ కొనాలో తెలియక కనకాన్ని పిలుస్తాడు. ఆంటి అని పిలుస్తాడు. దీంతో కనకానికి కోపం వస్తుంది. సరే అక్క అంటాడు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. కొంచెం దండలు సెలెక్ట్ చేయి అక్క అంటాడు. దీంతో కొన్ని సెలెక్ట్ చేస్తుంది. పెళ్లి కూతురు కడుపుతో ఉంది కదా అన్న. దండలు బరువు అవుతాయోమో అంటాడు ఇంకో రౌడీ. దీంతో ఆ మాట వింటుంది కనకం. పెళ్లి కూతురు కడుపుతో ఉండటం ఏంటి అని అడుగుతుంది. దీంతో నేను పెళ్లి చేసుకునేది ఏంజెల్ అంటాడు. నీకు కడుపుతో ఉన్నవాళ్లే దొరకుతారులే అంటుంది కనకం. దీంతో స్వప్న ఫోటోను చూపిస్తాడు మైఖేల్.
స్వప్న ఫోటో చూసి షాక్ అవుతుంది కనకం. ఇంతలోనే మైఖేల్ తన గ్యాంగ్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. పోలీసులతో కావ్య, రాజ్, సుభాష్ మాట్లాడుతారు. ఇదంతా పక్కాగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారని పోలీసులకు అనుమానం వస్తుంది. ఎవరి మీద అయినా అనుమానం ఉందా పోలీసులు అడుగుతారు. మొన్న విగ్రహాల దొంగతనం కూడా జరిగింది కదా. మీ ఫ్యామిలీ మీద కోపంతో ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు. డబ్బు కోసం చేసినట్టుగా అనిపించడం లేదు అని పోలీసులు అంటారు. వామ్మో.. ఇది నా మీదికి ఎక్కడ వస్తుందో అని రుద్రాణి టెన్షన్ పడుతుంది. విగ్రహాలను దొంగలించిన వారికి నాలుగు తగిలిస్తే వాళ్లే అసలు నిజం చెబుతారు అంటాడు పోలీసు.
మరో వైపు కావ్యకు కనకం ఫోన్ చేస్తుంది. దీంతో కావ్యకు ఏం చేయాలో అర్థం కాదు. స్వప్న వాళ్లు ఎక్కడున్నారు అని అడుగుతుంది. దీంతో కావ్యకు ఏం చెప్పాలో అర్థం కాదు. దీంతో రాజ్ ఫోన్ తీసుకొని స్వప్న కిడ్నాప్ అయిందని చెబుతాడు. అంటే వాడు చెప్పింది నిజమే అన్నమాట అని అనుకుంటుంది కనకం. ఎలాగైనా స్వప్నను కాపాడుకోవడం కోసం పూజారి గెటప్ వేస్తుంది కనకం. మైఖేల్ ను పూజారిగా నమ్మించి స్వప్న ఉన్న లొకేషన్ కు తీసుకెళ్లేలా చేస్తుంది కనకం. ఆ తర్వాత స్వప్న ఉన్న లొకేషన్ ను కావ్యకు పంపిస్తుంది. వీడియో కాల్ చేసి స్వప్న, మైఖేల్ ను చూపిస్తుంది కనకం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.