#image_title
Brahmamudi 3 Oct Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి సీరియల్ 3 అక్టోబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 217 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా అమ్మ ఇక్కడికి రమ్మంటే రానంటోంది. మీరేమో పంపించను అంటున్నారు. మరి ఈ సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుంది అని కావ్య.. అపర్ణతో అంటుంది. దీంతో కనకాన్ని పిలిస్తే ఎందుకు రాదు అని అంటుంది అపర్ణ. దీంతో మా అమ్మ మొండిది.. ఎవ్వరు చెప్పినా వినదు అంటుంది కావ్య. కూతురు కోసం ఆమాత్రం కూడా చేయదా అంటే.. ఎంత చెప్పినా నేను రాను అంటోంది అని కావ్య అంటుంది. దీంతో ఎందుకు రాదో నేను చూస్తాను అంటూ వెంటనే కనకానికి ఫోన్ చేస్తుంది. ఏంటి మీరు మా కోడలు పిలిస్తే రానన్నారట. రేపు పండగకి మీరు అందరూ ఇక్కడికి వస్తున్నారు. అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుంటున్నాం అని చెబుతుంది అపర్ణ. దీంతో కనకానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తుంది అపర్ణ. వదిన ఇంత పిచ్చిది అనుకోలేదు. ఆ కావ్య ప్లాన్ చేసి మరీ తన వాళ్లను పిలిపించుకుంటోంది అని అనుకుంటుంది రుద్రాణి.
మరోవైపు స్వప్న రెడీ అవుతుంది. వినాయకచవితి కోసం అందరూ రెడీ అవుతారు. అందరూ త్వరగా విగ్రహం తీసుకురండి అని చెబుతుంది ఇందిరాదేవి. ఇంతలో రాజ్, కావ్య, మిగితా వాళ్లు అందరూ దేవుడిని తీసుకొని వచ్చి అక్కడ పెడుతారు. ఇంతలో కావ్య బొట్టు చెడిపోతుంది. దీంతో బొట్టు పెట్టుకోవాలనే విషయం కూడా తెలియదా అంటూ అపర్ణ కావ్యపై సీరియస్ అవుతుంది. దీంతో దానికి అంత టెన్షన్ ఎందుకు.. రాజ్ వెళ్లి కావ్యకు కుంకుమ పెట్టు అంటుంది ఇందిరాదేవి. దీంతో రాజ్ తనకు కుంకుమ పెడతాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించాం కాబట్టి మన ఆనవాయితీ ప్రకారం కోరికల చిట్టీలను రాద్దాం అంటుంది ఇందిరాదేవి. మన మనసులో ఉన్న కోరికలను ఒక చిట్టీలో రాసి వినాయకుడి దగ్గర పెట్టాలి. వాటిని కూడా వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి.. అంటుంది ఇందిరాదేవి. ధాన్యలక్ష్మి వెళ్లి చీటీలు తీసుకొని వస్తుంది. అందరూ చీటీల మీద తమ కోరికలు రాస్తూ ఉంటారు.
#image_title
అందరూ చీటీలు రాయడంతో బిజీ అవుతారు. నా కొడుకుకు కావ్యతో కలిసి ఉండటం అస్సలు ఇష్టం లేదు. కానీ.. వాడు ఎందుకో కలిసి ఉన్నట్టుగా నటిస్తున్నాడు. కానీ ఉండలేకపోతున్నాడు. వాళ్ళిద్దరినీ దూరం చేయి స్వామీ అని అపర్ణ రాయగా.. రాజ్, కావ్య ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని సుభాష్ కోరుకుంటాడు. సీతారామయ్య కూడా కావ్య, రాజ్ గురించే రాస్తాడు. నాకంటూ ఏ కోరిక లేదు తండ్రీ. అడగకుండానే అన్నీ ఇచ్చావు. మా బావ చేతుల్లో సుమంగళిగా కన్నుమూస్తే అంతే చాలు అని రాస్తుంది ఇందిరాదేవి.
ఇక.. స్వప్న తెగ రాసేస్తూ ఉంటుంది. రాహుల్ అయితే స్వప్న పీడ విరగడ అయి ఒక వెయ్యి కోట్లు ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేయి స్వామి అని రాస్తాడు. ఇక.. కావ్య, రాజ్ ఇద్దరూ రాస్తుంటారు. రాజ్ ఏం రాస్తున్నాడా అని కావ్య చూస్తూ ఉంటుంది. కానీ.. కోరికలు చూడకూడదు అంటాడు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ నాటకాన్ని ముగించు స్వామీ. కావ్యతో నటించలేకపోతున్నాను అని రాస్తాడు రాజ్.
ఆయన మనసుకు నొప్పి కలగకుండా ఆయన ఏం కోరుకుంటున్నాడో అది నెరవేరేలా చూడు స్వామి అని రాస్తుంది కావ్య. అందరూ రాయడం పూర్తయిందా అని అడుగుతాడు కళ్యాణ్. అందరూ చిట్టీలు రాసి మడతపెడతాడు. అందరూ చిట్టీలు ఒక బౌల్ లో వేస్తారు. ఆయన నా గురించి ఏం కోరుకున్నారు.. అని అనుకుంటుంది కావ్య. రాజ్ ఏం రాశారో తెలుసుకోవాలని అనుకుంటుంది కావ్య.
అందరూ వంట పనులు పూర్తి చేయండి.. తర్వాత పూజ చేద్దాం అంటుంది. దీంతో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అవుతారు. దీంతో ఎవరూ లేరని తెలుసుకొని మెల్లగా ఆ చిట్టీ చదవడానికి వెళ్తుంది కావ్య. బౌల్ లో నుంచి చీటీ తీయబోతుండగా కళ్యాణ్ వచ్చి వదిన అంటాడు. అనామిక వస్తోంది అంటాడు. పండుగ అని ఇంటికి రమ్మన్నావా అంటే లేదు తనే వస్తోంది అంటాడు కళ్యాణ్.
అనామిక.. వాళ్ల అమ్మానాన్నలను తీసుకొని వస్తోంది. నేరుగా పెళ్లి విషయం మాట్లాడుతా అంటోంది. నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు అంటాడు. దీంతో ఏం కంగారు పడకండి. నేను చూసుకుంటానులే అంటుంది కావ్య. దీంతో కళ్యాణ్ వెళ్లిపోతాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ వస్తుంది. కావ్య ఇక్కడ ఏం చేస్తున్నావు. మీ అమ్మానాన్న వచ్చారు పదా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
This website uses cookies.