#image_title
Brahmamudi 30 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 30 సెప్టెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 215 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూజారిలా వేషం వేసుకొని కనకం.. మైఖేల్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. అక్కడి నుంచి కారులో తనను మైఖేల్ తను పెళ్లి చేసుకునే ప్లేస్ కి తీసుకెళ్తాడు. మరోవైపు స్వప్న ఏమైంది.. ఎక్కడికెళ్లింది అని కావ్య, ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటారు. హాస్పిటల్ లో రాహుల్ ఏదైనా చెబుతాడేమో అని అనుకుంటారు. కానీ.. రాహుల్ బాగా నటిస్తాడు. రుద్రాణి కూడా తనకేం తెలియదు అన్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అసలు స్వప్న ఏకమైపోయింది అని కావ్యకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరోవైపు పెళ్లికి అంతా రెడీ చేసి స్వప్నను పిలిచి పెళ్లి చేయి త్వరగా అంటాడు మైఖేల్. చిన్నగా స్వప్నకు సైగ చేసి నేను మీ అమ్మను అంటుంది కనకం. ఎలా పెళ్లి ఆపాలా అని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో కావ్యకు వీడియో కాల్ చేసి చూపిస్తుంది. అందులో స్వప్న, మైఖేల్ ఇద్దరూ కనిపిస్తారు.
దీంతో షాక్ అవుతారు. లైవ్ ఆన్ చేసి పెడుతుంది. లైవ్ లొకేషన్ పెట్టగానే వెంటనే తనను పట్టుకోవడానికి బయలుదేరుతారు కావ్య, రాజ్. రాహుల్ ఇంత పని చేస్తాడని మేము అనుకోలేదు అని కావ్య, రాజ్ అనుకుంటారు. ఇక.. తనకు మంత్రాలు రాకపోవడంతో ఓం భీం.. క్లీం అంటూ దయ్యాల మంత్రాలు చదువుతూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో మైఖేల్ కు అర్థం కాదు. త్వరగా పెళ్లి చేస్తే తనను తీసుకొని అండమాన్ వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. ఆ విషయం కూడా రాజ్, కావ్య వింటారు. కనకం పెట్టిన లైవ్ లొకేషన్ దగ్గరికి కావ్య, రాజ్ ఇద్దరూ వెంటనే బయలుదేరుతారు. మరోవైపు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తాడు రాహుల్. రాహుల్ ను అందరూ ఓదార్చుతారు. రాహుల్ కు లోలోపల చాలా సంతోషం ఉంటుంది. స్వప్నను మైఖేల్ చంపేశాడు అని అనుకుంటాడు. అదే విషయం రుద్రాణికి కూడా చెబుతాడు.
#image_title
అందుకే ఇంటికి వెళ్లిన తర్వాత ఇక ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. స్వప్నకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను మమ్మీ అంటాడు రాహుల్. ఆ బాధతో నేను బతకలేను. నేనూ చచ్చిపోతాను. స్వప్న దూరం అయ్యాకే నేను ఏం కోల్పోయానో నాకు అర్థం అవుతోంది.. అని అంటాడు రాహుల్. దీంతో అందరూ షాక్ గా చూస్తుంటారు. కానీ.. ఇంతలో అసలు ట్విస్ట్ బయటపడుతుంది.
అప్పుడే కావ్య, రాజ్ ఇద్దరూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. స్వప్న దూరం అవ్వలేదు అంటాడు రాజ్. దీంతో అందరూ షాక్ అవుతారు. అదేంటి స్వప్న దూరం కాకపోవడం ఏంటి అని అందరూ అనుకుంటారు. రాహుల్, రుద్రాణి కూడా షాక్ అవుతారు. ఇంతలో స్వప్న ఇంట్లోకి వస్తుంది. స్వప్నను చూసి రాహుల్ కు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందరూ స్వప్న వచ్చిందని సంతోషపడతారు.
ఇంతలో తాతయ్య లేచి.. స్వప్నను ఎవరు తీసుకెళ్లారో తెలిసిందా అని అడుగుతాడు తాతయ్య. రాజ్ ను అడుగుతాడు. దీంతో తెలిసింది తాతయ్య అంటాడు రాజ్. ఒక్కసారిగా రాహుల్, రుద్రాణికి ఏం చేయాలో అర్థం కాదు. వీళ్లకు విషయం తెలిసిపోయింది అని అనుకుంటారు. అయితే.. కావ్య, రాజ్ ఇద్దరూ కలిసి కనకం సాయంతో మైఖెల్ నుంచి స్వప్నను కాపాడగలుగుతారు. స్వప్నను కాపాడిన తర్వాత కావ్య, రాజ్ ఇద్దరూ కలిసి తనను ఇంటికి తీసుకొస్తారు. చనిపోయింది అనుకొని రాహుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ.. సడెన్ గా స్వప్న ప్రత్యక్షం కావడంతో రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.