Brahmamudi 9 Oct Today Episode : ఎవ్వరికీ కనిపించకుండా కావ్య ఎక్కడికి వెళ్లింది.. రాజ్ పై మనసు విరిగి ఆత్మహత్య చేసుకుంటుందా? కనకం ఏం చేస్తుంది?

Brahmamudi 9 Oct Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 9 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 222 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కావ్య.. సీతారామయ్య దగ్గరికి వెళ్లిందేమో అనుకొని వాళ్ల రూమ్ లోకి వెళ్లి అడుగుతాడు. దీంతో ఇక్కడికి రాలేదు అంటాడు సీతారామయ్య. అంతటా వెతికావా అంటే వెతికాను అంటాడు. ఆ తర్వాత హాల్ లోకి వెళ్లి కాల్ చేస్తారు రాజ్. కానీ.. నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అందరూ బయటికి వచ్చి ఏమైంది రాజ్.. కావ్య లేదా మా రూమ్ లో కూడా లేదు అని అందరూ చెబుతారు. దీంతో కావ్య ఎక్కడికి వెళ్లింది అని అందరూ టెన్షన్ పడతారు. ఎక్కడా లేదు అనే సరికి షాక్ అవుతారు. నేను ఇందాక తాతయ్య కోసం నటిస్తున్నా అని నోరుజారినప్పుడు ఫీల్ అయి వెళ్లిపోయిందా అని మనసులో అనుకుంటాడు రాజ్. అందరూ టెన్షన్ పడతారు. నీకు తెలియకుండా ఏం జరగదు కదా. కావ్య నీకు ఏం చెప్పలేదా అని అందరూ అడుగుతారు.

దీంతో నేను కావ్య ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా అని రాజ్ అంటాడు. మీరు నిద్రపోండి.. అని అంటాడు రాజ్. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీకి చెందిన కోడలు కనిపించకుండా ఉంటే మేము నిద్రపోవాలా అంటాడు సీతారామయ్య. రాజ్ ఏం అనలేదు.. మరి అత్తగారు ఏమైనా అన్నారేమో.. అందుకే కావ్య బయటికి వెళ్లిపోయిందేమో అంటుంది రుద్రాణి. నేనేం అనలేదు అంటుంది అపర్ణ. దీంతో అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నారు. ఈ ఇంట్లో అలాంటివి కొత్తేం కాదు కదా. అత్తగారింటికి వచ్చిన కొత్తలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చిన ధీర వనిత మీ కోడలు. అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి అంటూ రుద్రాణి చెబుతుంది. మధ్యలో నన్నెందుకు లాగుతారు అంటూ స్వప్న కోప్పడుతుంది. నేనేం మా చెల్లెలా తిన్నది అరక్క వెళ్లలేదు అనేసరికి రాజ్ కి కోపం వస్తుంది. నా కోడలు వెళ్లిపోవడానికి కారణాలు ఉన్నాయి. మరి నీ భార్య ఇంతమందిని ఇరకాటంలో పడేసి వెళ్లడం దేనికి అని అడుగుతుంది రుద్రాణి.

#image_title

Brahmamudi 9 Oct Today Episode : కావ్యను వెతకడానికి వెళ్లిన దుగ్గిరాల ఫ్యామిలీ

కావ్య గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు లేదు.. నీ కోడలుకు లేదు రుద్రాణి అంటుంది అపర్ణ. కావ్య నాకు నచ్చినా నచ్చకపోయినా నీ కొడుకు, కోడలు విషయంలో మంచే చేసింది. నీ లాగా.. నీ కోడలులా కావ్య బాధ్యత లేకుండా ప్రవర్తించదు అంటుంది అపర్ణ. ఏంటి మా వదినేనా కావ్యను సపోర్ట్ చేసేది.. అని అంటుంది రుద్రాణి.

నాకు నటించాల్సిన అవసరం లేదు రుద్రాణి అంటుంది అపర్ణ. అసలు కావ్య ఇలా చెప్పకుండా వెళ్లే మనిషి అయితే కాదు అంటుంది ధాన్యలక్ష్మీ. కావ్య గురించి మాట్లాడటమేనా.. వెళ్లి వెతకడం ఏమైనా ఉందా. కావ్యకు ఎవరైనా హాని తలపెట్టి ఉండొచ్చు కదా. ముందు కావ్యను వెతకండి అంటాడు సీతారామయ్య.

దీంతో అందరూ వెతకడానికి వెళ్తారు. నాకు నిద్ర వస్తోంది. నేను వెళ్లి పడుకుంటాను అంటుంది స్వప్న. కడుపు అన్నం తినే మనిషిలా మాట్లాడు అన్నట్టుగా ఇంద్రాదేవి మాట్లాడుతుంది. మామయ్య గారు మీరు టెన్షన్ పడకండి. వెతకడానికి వెళ్లింది మీ మనవడు. మీ మనవరాలితోనే తిరిగి వస్తాడు. మీరు నిశ్చింతగా ఉండండి అంటుంది అపర్ణ.

మరోవైపు రాజ్, కళ్యాణ్, సుభాష్, ఆయన తమ్ముడు అందరూ తలో దిక్కు వెళ్లి కావ్యను వెతుకుతుంటారు. కావ్య మాత్రం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు కనకం.. ఇంటి పేపర్స్ తీసుకొచ్చి మూర్తికి ఇస్తుంది. ఇవి నాకెందుకు అంటే.. లేదయ్యా మీ దగ్గరే ఉండాలి అంటుంది. పాతికేళ్ల కింద ఇది నా దగ్గర ఉంచమని మీరు అంటే నేను దాన్ని సరిగ్గా దాచలేకపోయాను. కూతురు పెళ్లి కోసం అని చెప్పి నేను ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాను అంటుంది కనకం.

దీంతో నన్ను ఆ మార్వాడి వాడు తక్కువ చేసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోయావు. భార్య కంటే నమ్మకస్తులు ఒక భర్తకు ఎవరు ఉంటారు చెప్పు. నాకు నమ్మకం ఉంది. తీసుకెళ్లి లోపల పెట్టు అంటుంది కనకం. దీంతో సరే పదండి పడుకుందాం అంటుంది కనకం.

ఇంతలో కనకానికి ఫోన్ వస్తుంది. ఎవరు అని చూస్తే రాజ్. చెప్పండి బాబు ఈ టైమ్ లో చేశారు అంటే.. ఆంటి అక్కడికి ఏమైనా మీ అమ్మాయి వచ్చిందా అంటే.. కావ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది బాబు. ఇందాక మీ ముందే కదా మమ్మల్ని పంపించింది అని అడుగుతుంది.

దీంతో కావ్య అక్కడికి కూడా వెళ్లలేదు అన్నమాట అని అనుకుంటాడు రాజ్. కావ్య ఇంట్లో లేదా అని అడుగుతుంది కనకం. దీంతో ఏదో పని ఉండి బయటికి వెళ్తున్నా అని చెప్పింది. ఇప్పటి వరకు రాలేదు. అందుకే అక్కడికి ఏమైనా వచ్చిందేమో అని ఫోన్ చేశా అంటాడు రాజ్.

ఇంత రాత్రి పూట కావ్య ఎక్కడికో వెళ్లిపోవడం ఏంటి.. నాకేదో అనుమానంగా ఉంది అంటుంది కనకం. దీంతో అవును.. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లి ఉంటుంది అంటాడు మూర్తి. తప్పకుండా ఇంట్లో ఏదో జరిగే ఉంటుంది. ఒకసారి కావ్యకు ఫోన్ చేయి అంటాడు మూర్తి. దీంతో సరే.. అని ఫోన్ చేస్తుంది కానీ.. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లి ఉంటుంది. కళ్యాణ్ కు కాల్ చేస్తా అని చెప్పి కళ్యాణ్  కు కాల్ చేస్తుంది కనకం.

కానీ.. కళ్యాణ్ ఫోన్ ఎత్తడు. బైక్ మీద కావ్యను వెతకడం కోసం వెళ్తాడు. కావ్య ఫోటో చూపించి తను ఎక్కడైనా కనిపించిందా అని అందరూ అడుగుతుంటారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేస్తుంది కనకం. దీంతో కళ్యాణ్ ఫోన్ ఎత్తుతాడు. మీ అన్నయ్య మొత్తం చెప్పాడు ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో తను ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లింది. తన కోసం వెతుకుతున్నాం అంటాడు. దీంతో కనకం షాక్ అవుతుంది.

వెంటనే కనకం, మూర్తి దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. నా కూతురును ఏం చేశావు చెప్పు బాబు అని అడుగుతుంది కనకం. మీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో నా కూతురును ఉంచడంలో అర్థం లేదు. మీకు ఇష్టం లేకపోతే మా చేతుల్లో పెట్టండి. నాకు నా కూతురు కావాలని పెద్ద గొడవ చేస్తుంది కనకం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

31 minutes ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

2 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

3 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

4 hours ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

5 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

6 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

7 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

8 hours ago