Categories: EntertainmentNews

Brahmamudi Serial Today Episode April 16th : గుడిలో అపర్ణ బర్త్‌డే ను సెల‌బ్రేట్ చేసిన రామ్‌.. ఉలిక్కిపడిన యామిని

Brahma Mudi Serial Today Episode : బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఏం జ‌రిగిందో తెలుసుకుందాం. రుద్రాణికి ఇంటిల్లిపాది చివాట్లు పెట్టిన తర్వాత పైనుంచి అప్పు వస్తుంది. ఏం పొట్టి పోలీస్ ఎక్కడికి టింగురంగా అని బయలుదేరావు అని రుద్రాణి అంటే ఆ.. ఓ ఫ్యామిలీని ఇబ్బందిపెడుతున్న వాళ్లను పట్టుకునేందుకు అని చెబుతుంది అప్పు. అందులో మన జాతి రత్నాలు లేరా అని స్వప్న అంటుంది. మనల్ని కాదులే అని రాహుల్ అంటే.. దొంగలే దొంగలు కాదని అనడం చాలా ఫన్నీగా ఉందని స్వప్న వెళ్లిపోతుంది. అక్క‌ చెప్పినట్లు ఆ లిస్ట్‌లో మీ పేర్లు లేకుండా ఉండాలని కోరుకోండి. ఉంటే మాత్రం మీరు అంటున్న ఈ పొట్టి పోలీస్ పవర్ ఏంటో చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అప్పు. అయితే అపర్ణ నార్మల్‌గా మారి గుడికి వెళ్లడంపై ఇద్దరూ సందేహం వ్య‌క్తం చేస్తారు.

Brahmamudi Serial Today : గుడిలో అపర్ణ బర్త్‌డే ను సెల‌బ్రేట్ చేసిన రామ్‌.. ఉలిక్కిపడిన యామిని

మరోవైపు కావ్య పంపిన షర్ట్ వేసుకుని రాజ్ రెడీ అయి అద్దంలో చూసుకుంటాడు. హాల్‌లో యామిని తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది. వైట్ డ్ర‌స్‌లో రామ్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతారు. ఈ డ్రెస్‌లో చాలా బాగున్నారని ప్ర‌శంస‌లు కురిపిస్తారు. అయితే యామిని మాత్రం అస్సలు నచ్చలేదు అంటుంది. దానికి రామ్ స్పందిస్తూ అందరికి నచ్చి నీకు మాత్రమే నచ్చలేదంటే ప్రాబ్లమ్ నీలోనే ఉన్నట్లు కదా అంటాడు. ఇంత‌కి ఏ గుడికి వెళ్తున్నావ్ అని యామిని అడిగితే శివాలయానికి అని అబద్ధం చెబుతాడు రామ్.

మరోవైపు గుడిలో రాజ్ కోసం కావ్యతో అపర్ణ ఎదురు చూస్తుంటుంది. కావ్య నిజం చెప్పు వాడికోసం ఇంట్లో ఏడుస్తున్నానని అబద్ధం చెప్పటం లేదు కదా అని అంటుంది అపర్ణ. వాడు రాకపోతే కనీసం ప్రసాదం కూడా ముట్టుకోను అని అపర్ణ అంటుంది. అదిగో అనగానే వచ్చేశారు అని కావ్య చెబుతుంది. ఎక్కడ ఎక్కడ అంటూ చూస్తుంది అపర్ణ. కారులో నుంచి రామ్‌గా రాజ్ దిగుతాడు. రాజ్‌ను చూసి అపర్ణ షాక్ అవుతుంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజ్.. రాజ్.. నిజమే.. నా కొడుకుకి ఏం కాలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. ఎన్నాళ్లు అయిపోయిందిరా నిన్ను చూసి అని అపర్ణ సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అంటుంది. అపర్ణ కలవడానికి వెళ్తుంటే.. కావ్య ఆపుతుంది.

మీరు ఇలా ఎమోషనల్ అవుతారనే ఇన్నాళ్లు ఆయన్ను మీకు చూపించలేదు అని కావ్య అంటుంది. కనీసం దగ్గరికైనా వెళ్లకుండా ఎలా ఉండను అని బాధపడుతుంది అపర్ణ. ఆయన దేనిగురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే అది ఆయనకే ప్రమాదమని చెప్పానుగా. ఆయన మనకు ప్రాణాలతో దక్కాలంటే మీరు మౌనంగా ఉండాలి అని అంటుంది కావ్య. గుడిలోకి వెళ్తాడు రాజ్. సరే నువ్వు అన్నట్లు ఏం మాట్లాడను. కానీ దగ్గరి నుంచి అయినా చూడని అంటుంది అప‌ర్ణ‌. దాంతో సరే అని కావ్య జాగ్రత్త చెబుతుంది.

Brahmamudi Serial Today Episode April 16th త‌న్మ‌య‌త్నంలో అప‌ర్ణ

రాజ్‌కు ఎదురుగా, దగ్గరిగా అపర్ణ వెళ్తుంటుంది. అప్పుడే ఏదో అడ్డుపడి అపర్ణ కిందపడబోతుంది. అమ్మా అంటూ అపర్ణను కిందపడకుండా కాపాడుతాడు రాజ్. అదంతా కావ్య చూస్తూ ఉంటుంది. అపర్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. అపర్ణకు కన్నీళ్లు వస్తుంటాయి. అమ్మా ఏమైందమ్మా కళ్లు తిరిగాయా అని రాజ్ అడుగుతాడు. తేరుకున్న అపర్ణ.. అవును బాబు. ఉపవాసం ఉండటం వల్ల కళ్లు తిరిగాయి అని అపర్ణ చెబుతుంది. జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి ముందుకు నడుస్తాడు రాజ్. ఆయన అత్తయ్య గారిని గుర్తుపట్టేసారా అని కావ్య అనుకుంటుంది. అపర్ణ ముందుకు వచ్చి కాళ్ల కింద ఉన్న కర్చీఫ్ తీసి ఇస్తాడు. హా నాదే బాబు అని అపర్ణ తీసుకుంటుంది.

పక్కకు వెళ్లిన అపర్ణ కొడుకుతో మాట్లాడినందుకు తన్మయత్నం చెందుతుంది. అపర్ణకు తన బర్త్ డే నాడే కొడుకు మాట్లాడే గిఫ్ట్ అందినట్లు అవుతుంది. ఇంతలో కావ్య వచ్చి అపర్ణను కిందకు తీసుకుపోతుంది. మీరు కనిపించిన ప్రతిసారి ఇలా ఎమోషనల్ అయితే ఆయనకు డౌట్ వస్తుంది. కొంతకాలం ఈ బాధను దాచుకోండి అని కావ్య చెబుతుంది. కావ్య కనిపించకపోయేసరికి కాల్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతాడు రాజ్‌. మీ గుండెల్లో అని కావ్య అంటుంది. ఏంటీ అని రాజ్ అడిగితే.. గుడిలో అండి అని కావ్య చెబుతుంది. అదే ఎక్కడ అని రాజ్ అంటే.. మీరు వెనక్కి తిరిగితే కనిపిస్తాను అని రాజ్‌కు కావ్య కనిపిస్తుంది. అలానే చూస్తూండిపోతాడు రాజ్. ఏంటండి అని కావ్య అంటే.. ఇప్పటిదాకా దేవత అక్కడ ఉండేది కదా. ఇటెప్పుడు వచ్చిందా అని రాజ్ అంటాడు. మీరు బిస్కెట్లు పాకెట్లో పెట్టుకుని తిరుగుతుంటారా అని కావ్య అంటే.. లేదు జేబులోనే పెట్టుకుంటాను అని రాజ్ అంటాడు. రాజ్ చేతులమీదుగా జరిపించిన అన్నదానంలో అపర్ణ కూడా తింటుంటుంది.

ఉలిక్కిపడిన యామిని

అపర్ణను కావ్యకు చూపిస్తూ ఆవిడను చూస్తుంటే చిన్నప్పుడు దూరమైన మా అమ్మే గుర్తుకు వస్తుందని, ప్రతి సంవత్సరం ఆవిడ కొడుకే ఆమె పేరుమీద అన్నదానం చేయించేవాడట. ఆమె పుట్టినరోజున ఒక చిన్న కేక్ కట్ చేయిస్తే బాగుంటుందండి అని రాజ్ అంటాడు. అపర్ణకు రాజ్ కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తాడు రామ్‌గా ఉన్న రాజ్. అది చూసిన యామిని ఉలిక్కిపడుతుంది. రాజ్‌కు అపర్ణ కేక్ తినిపిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Recent Posts

Eating Hot Food : మీకు వేడివేడి ఆహారం ఇష్టమా… అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు…?

Eating Hot Food : వేడివేడి ఆహారాలను తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో వేడివేడిగా తినాలని కోరిక ఉంటుంది.…

45 minutes ago

Chandrababu : చంద్రబాబు పద్ధతి కొత్తగా ఉందే.. ప్రజల్లో ప్ర‌శంసలు..!

Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన రాజకీయ తీరును కొత్తదిగా తీర్చిద్దుకుంటున్నారు. గతంలో పరిపాలనలో సాంకేతికత,…

2 hours ago

Swapna Shastra : శ్రావణ మాసంలో మీకు ఇవి కనిపిస్తే… శివుని అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది….?

Swapna Shastra : హిందూ ధర్మశాస్త్రంలో శ్రావణ మాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో స్త్రీలు ఎన్నో…

3 hours ago

Doddi Komarayya Movie : దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ..!

Doddi Komarayya movie : నాగార్జునసాగర్ నియోజకవర్గం : హాలియా పట్టణం లో R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ…

10 hours ago

Jasprit Bumrah : నాలుగో టెస్టుకు గుడ్‌న్యూస్… బుమ్రా రీఎంట్రీతో బలపడిన భారత బౌలింగ్..!

Jasprit Bumrah : ఇంగ్లండ్‌తో England జరుగుతున్న టెస్టు సిరీస్‌లో India Test Match ఇండియా అభిమానులకు సంతోషకరమైన వార్త.…

11 hours ago

Husband Wife : ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు..? అని అడిగినందుకు భర్తను చంపిన భార్య..!

Husband Wife : ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం…

12 hours ago

Bolisetty Srinivas : “రోజా ఆడదా? మగదా? ” అంటూ జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వీడియో..!

Bolisetty Srinivas : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ మరింత అపహాస్య స్థాయికి చేరుతోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం…

13 hours ago

Roja : పవన్ కల్యాణ్‌కి మానసిక స్థితి బాగాలేదంటూ రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

Roja  : మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. నగరిలో జరిగిన "రీకాలింగ్…

14 hours ago