Brahmanandam : తెర మీద ఆయన కనబడితే చాలు..నవ్వులు పూయాల్సిందే.. వెండితెర హాస్య రారాజు అయిన ఆయన్ను చూడటానికి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడుతుంటారు. ఆయనెవరో కాదు.. హస్య చక్రవర్తి బ్రహ్మానందం.. ప్రజలందరినీ నవ్వించే గొప్ప నటుడు బ్రహ్మానందం.. ఆయనకు సన్మానం జరిగిన తర్వాత వెళ్లి ఇంటిలో లుంగీ కట్టుకుని మరీ నేల మీద పడుకుంటారు. ఈ విషయంతో పాటు పలు విషయాలను ఆయనే స్వయంగా తెలిపాడు. ఎక్కడంటే..తెలుగు తెరపై దాదాపు ప్రతీ ఒక్క హీరోతో నటించిన బ్రహ్మానందం.. ఇప్పటి వరకు 1,000కి పైగా చిత్రాల్లో నటించాడు.
ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో దిట్ట అయిన బ్రహ్మానందం మీడియాకు ఇంటర్వ్యూలు అరుదుగా ఇస్తుంటారు. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి గెస్టుగా వచ్చి, పలు ఆసక్తి కర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఈటీవీ వారు విడుదల చేయగా అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆలీ, బ్రహ్మనందం చక్కగా పలు విషయాల గురించి చర్చించుకున్నారు. లెక్చరర్‌గా ఉన్న తాను నటుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజలను నవ్వించగలనని నమ్మిన వ్యక్తి కీర్తి శేషులు జంధ్యాలని చెప్తూ బ్రహ్మానందం భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే తాను భగవంతుడు, తల్లిదండ్రుల తర్వాత కృతజ్ఞత చెప్పుకోవాల్సింది జంధ్యాల గారికేనని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే తన సినీ ప్రయాణంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తన తల్లిదండ్రులతో కలిసి సత్తెనపల్లి థియేటర్‌లో సినిమా చూసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తనకు ఎవరైనా ఏ రోజైనా సన్మానం చేస్తే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత లుంగీ కట్టుకుని నేల మీదనే పిచ్చ వెధవాలాగా పడుకుంటానని పేర్కొన్నారు. ఇందుకు గల కారణం కూడా విచిత్రంగా ఉంటుందని తెలిపిన బ్రహ్మానందం.. అది పేర్కొనే లోపే ప్రోమో ముగుస్తుంది. మొత్తంగా ఆలీతో జాలీగా ఆనాటి విషయాలను వారిద్దరి మధ్య షూటింగ్ నేపథ్యంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఇంటర్వ్యూ జరిగినట్లు ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.