Karthika Deepam 24 Nov Today Episode : బారసాలలోనే మోనిత బండారం బట్టబయలు.. శాంపిల్స్ దొంగలించి బిడ్డను కన్న మోనిత.. అన్నీ బయటపెట్టేసిన దీప

Karthika Deepam 24 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 నవంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1205 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బారసాలకు దీప బ్యాగుతో సహా వచ్చిన విషయం తెలిసిందే. ఏం మోనిత.. అన్ని ఏర్పాట్లు చేశావా.. పంతులు గారు వంటలు అన్నీ అని అడిగేసరికి.. పంతులు గారు వస్తున్నారు కానీ.. క్యాటరింగ్ వాళ్లే మిస్ చేశారు అంటే.. అయ్యో ఎలా మోనిత.. అసలే నీ కార్తీక్ వస్తున్నాడు. మీ అత్తయ్య గారు వస్తున్నారు. వాళ్లకు ఇష్టమైనవి చేయించావా లేదా.. సరే.. వంటలది ఏముంది నేను వంటలక్కనే కదా.. నేను చిటికలో చేసేస్తాను అంటుంది.

Karthika deepam 24 november 2021 full episode

వంటగది ఎక్కడుందో చూపించు అంటే మోనిత కాస్త మొహమాటపడుతుంది. అసలు మోనితకు ఏం అర్థం కాదు. దీపక్క ఏం చేస్తోంది అని అనుకుంటుంది. వంట గది చూపిస్తుంది. ఇంతలో కార్తీక్, సౌందర్య, ఆనంద రావు.. ముగ్గురు మోనిత ఇంటికి వస్తారు. మమ్మీ వెనక్కి వెళ్లిపోదాం అంటాడు కార్తీక్. మనం వచ్చింది మోనిత కోసం కాదు.. బాబు కోసం కాదు.. దీప కోసం.. అంటుంది. దీప కోసం వస్తే వాళ్ల పుట్టింటికి వెళ్లాలి కానీ.. ఇక్కడికి ఎందుకు రావడం అంటాడు కార్తీక్. దీప వెళ్లడానికి కారణాలు ఏంటో మనకు తెలుసు కదా. ఇక్కడి రమ్మన్నది కదా.. అందుకే మనం ఇక్కడికి వచ్చాం అంటారు ఆనంద రావు, సౌందర్య.

లోపలికి వెళ్లిపోబోతుండగా.. వారణాసి కనిపిస్తాడు కార్తీక్ కు. దీప వచ్చిందా అని అడుగుతాడు. అవును బాబు.. అక్క ఏదో బ్యాగు సర్దుకొని వచ్చింది. అక్క మనల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోబోతోంది అంటాడు. ఏడవకు.. దీప ఎక్కడికి వెళ్తుందో నేనూ చూస్తాను అంటాడు కార్తీక్.

ఇంతలో దీప, మోనిత.. ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. వంటలు ఎలా జరుగుతున్నాయి అని అడుగుతుంది మోనిత. దీపను చూసిన కార్తీక్.. దీప ఏమైంది నీకు. ఇక్కడికి రావడం ఏంటి.. అంటాడు కార్తీక్. రండి.. రండి.. పాపం మీరు రారేమోనని మోనిత టెన్షన్ పడుతుంది అంటుంది దీప.

Karthika Deepam 24 Nov Today Episode : దీపను మోనిత ఇంట్లో చూసి షాక్ అయిన కార్తీక్

నువ్వు వంటలు చేయడం ఏంటి.. నీకు ఇక్కడేం పని. నీకేమన్నా మతి పోయిందా పదా వెళ్దాం అంటాడు కార్తీక్. వంటలక్క చేసేది వంటలే కదా డాక్టర్ బాబు ఇందులో తప్పేముంది అంటుంది దీప. బారసాల మొదలు పెట్టు అంటుంది మోనితను. పెద్ద వాళ్లు అత్తయ్య గారు బాబును ఉయ్యాలలో వేస్తే బెటర్ అంటుంది మోనిత.

మొత్తానికి బారసాల ప్రారంభం అవుతుంది. బాబు తండ్రిని పిలవండి అని పంతులు అంటాడు. ఏంటి మోనితా ఇది.. వచ్చిన వాళ్లకు మీ ఫ్యామిలీని పరిచయం చేయవా అంటుంది దీప. దీంతో అందరికీ పరిచయం చేస్తుంది. దీంతో కార్తీక్ కు కోపం వస్తుంది. దీంతో మీరు ఆగండి డాక్టర్ బాబు అంటుంది దీప.

నన్ను పరిచయం చేయవా మోనిత అంటుంది. దీంతో ఈవిడ మా అక్క. దీపక్క అంటుంది మోనిత. నేను నీకు అక్కను ఎలా అవుతాను అంటుంది. దీప తన ప్లాన్ ను స్టార్ట్ చేస్తుంది. దీంతో దీప నా భార్య అంటాడు కార్తీక్. నా జీవితం. తనే నా ప్రపంచం అంటాడు కార్తీక్.

ఈవిడ మీ భార్య అయితే.. మరి ఆవిడ ఎవరు అని పంతులు ప్రశ్నిస్తాడు. ఈవిడ ఎవరో.. ఈవిడ కథాకామీషు అన్నీ నేను చెబుతాను పంతులు గారు అంటుంది దీప. అసలేం జరిగిందంటే చెప్పడానికి మాకు.. వినడానికి మీకు కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది.. అని చెప్పి మొత్తం స్టోరీ చెబుతుంది దీప.

మోనిత మోసం మొత్తం బట్టబయలు చేస్తుంది దీప. దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్ కొట్టేయడం.. అన్నీ చెప్పేస్తుంది దీప. అయినా కూడా కార్తీక్ వల్లే నేను తల్లినయ్యాను అంటుంది మోనిత. దీంతో నోర్మూయ్ అంటూ చెంప వాయించబోతుంది దీప. వెంటనే ల్యాబ్ రిపోర్టులను చూపిస్తుంది. దీంతో దీపకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Chiranjeevi | సైకిల్‌పై వందల కిలోమీటర్లు ప్రయాణించిన అభిమాని.. రాజేశ్వరి‌కు మెగాస్టార్‌ చిరంజీవి అండ

Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…

11 minutes ago

War 2 | వార్ 2 ఓటీటీ టైం ఫిక్స్ అయిన‌ట్టేనా.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుండి అంటే..!

War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…

1 hour ago

Barrelakka | మ‌ళ్లీ వార్త‌ల‌లోకి బ‌ర్రెల‌క్క‌.. ఈ సారి ఏం చేసిందంటే..!

Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అంద‌రి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…

2 hours ago

Hansika | హ‌న్సిక విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఈ పోస్ట్‌తో ఫిక్స్ అయిన ఫ్యాన్స్

Hansika | స్టార్ హీరోయిన్‌ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న…

3 hours ago

LOBO | బిగ్ బాస్ ఫేమ్ లోబోకి ఏడాది జైలు శిక్ష‌.. ఏం త‌ప్పు చేశాడంటే..!

LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…

4 hours ago

Sleep | రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలి అంటే ఇవి తింటే చాలు..

Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…

5 hours ago

Clove Side Effects | లవంగం వినియోగం ..మితంగా తీసుకుంటే ఔషధం, అధికంగా తీసుకుంటే హానికరం!

Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…

6 hours ago

Health Tips | పాలు, పెరుగు విషయంలో జాగ్రత్తలు అవసరం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రమాదమేనా?

Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…

7 hours ago