Bigg Boss Sarayu : బ్రేకింగ్‌.. బిగ్ బాస్ స‌ర‌యు అరెస్ట్‌..!

Advertisement

SARAYU.. బో కామెంట్ల‌తో నెట్టింట్లో ర‌చ్చ చేసే బిగ్ బాస్ స‌ర‌యు చిక్కుల్లో ప‌డింది. చివ‌ర‌కు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌ర‌యుకు ప్ర‌మోష‌న్లు బాగానే వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ హోట‌ల్ ప్ర‌మోష‌న్ సాంగ్ చేసింది స‌ర‌యు. అయితే ఇందులో ఆమె చేసిన ప‌నితో వీహెచ్‌పీ నేత‌లు ఆమె మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. హోట‌ల్ ప్ర‌మోష‌న్‌లో హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీసేలా స‌ర‌యు చేసింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆమె ఈ పాట‌లో త‌ల‌కు గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా అనే బ్యాండ్ ను క‌ట్టుకుని హోట‌ల్‌కు వెళ్ల‌డం ఇందులో మ‌న‌కు క‌నిపిస్తుంది. అంటే హిందువులు అలా దేవుళ్ల బొమ్మ‌ల బ్యాండులు క‌ట్టుకుని హోట‌ళ్ల‌కు వెళ్తారంటూ హిందువుల‌ను అవ‌మానించార‌ని వీహెచ్ పీ సిరిసిల్ల అధ్య‌క్షుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

Advertisement
breaking bigg boss Sarayu arrest
breaking bigg boss Sarayu arrest

దీంతో ఈ కేసును బంజారా హిల్స్ పోలీసుల‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌గా.. వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆమె మీద సోష‌ల్ మీడియాలో కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తే ఊరుకోబోమంటూ చెబుతున్నారు.

Advertisement
Advertisement