Home » Entertainment » Breaking News About Anasuya Son
Entertainment

Anasuya : అనసూయ కొడుకు గురించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ !

Authored By
aruna
The Telugu News | Updated on: May 21, 2023 7:01 pm
Advertisement

Anasuya : జబర్దస్త్ యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాలను అలరించిన అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైనే అవుతున్న ఇప్పటికీ అనసూయ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మరు. ఆమెది ప్రేమ వివాహం. సుశాంక్ భరద్వాజ ని ఆమె ఎన్సీసీ క్యాంప్ లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అనసూయకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. అయితే ఇటీవల పెద్దబ్బాయి పుట్టినరోజు చేశారు. ఈ సందర్భంగా అనసూయ సోషల్ మీడియాలో తమ ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కొడుకు వయసు ఎంతో రివీల్ చేసింది.

Advertisement

కాలం కనురెప్ప పాటులో గడిచిపోయింది. మా అబ్బాయికి అప్పుడే టీనేజ్ వయసు వచ్చింది, నమ్మలేకపోతున్నాను అని కామెంట్ చేసింది. టీనేజ్ 13 ఏళ్లకు స్టార్ట్ అవుతుంది. అనసూయకు అంత వయసున్న కొడుకు ఉన్నాడా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అందుకే యాంటీ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అంటూ ఎచ్చిడి చేస్తున్నారు. ఇక ఆమెను ఇస్టపడే అభిమానులు మాత్రం ఆ వయసు పిల్లలున్న మీరు చాలా అందంగా ఉన్నారంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇక అనసూయ జబర్దస్త్ ను వదిలేసిన సంగతి తెలిసిందే. ఆ షో ఆమెకు లైఫ్ ఇచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ షో ద్వారానే ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు.

Breaking news about Anasuya Son

Advertisement

నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ రావడంతో వెండితెరకు పరిమితం అయ్యారు. బుల్లితెరపై ఆమె కనిపించడమే లేదు. ఇటీవల రంగమర్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తరువాత అనసూయ చేతిలో ఇంకా క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుందని సమాచారం. మనందరికీ తెలిసిందే పుష్ప మొదటి భాగం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సినిమాలో అనసూయ విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దేశమంతట పుష్ప సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి