Prabhas : బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి రాకముందు ప్రభాస్ మార్కెట్ కేవలం దక్షిణాదిలో అది కూడా తెలుగులో మాత్రమే ఉండేది. కానీ బాహుబలి పుణ్యమా.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది ప్రేక్షకులు ప్రభాస్ నుండి బాహుబలి లాంటి సినిమాలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు సాహో, రాదేశ్యం రెండు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పైగా ఈ రెండు సినిమాలు కోసం దాదాపు నాలుగు సంవత్సరాలకు
పైగా టైం కేటాయించడం అభిమానులకు ఎంతో నిరుత్సాహాన్ని కలిగించింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా ప్రభాస్ చేయడం తెలిసిందే. అయితే ఈ సినిమా విజువల్స్ చాలా దారుణంగా చండాలంగా ఉండటంతో ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సింది జూన్ నెలకి పోస్ట్ పోన్ అయింది. గ్రాఫిక్స్ వర్క్స్ చాలా చండాలంగా ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా యూనిట్ పై మండిపడ్డారు. విపరీతమైన నెగిటివిటీ మరియు ట్రోలింగ్ జరగటంతో జూన్ 16వ తారీకు “ఆది పురుష్” విడుదల చేస్తున్నారు. మొత్తం గ్రాఫిక్స్ వర్క్స్ అంత మార్చే పనిలో సినిమా యూనిట్ నిమగ్నమయింది. ఇలాంటి పరిస్థితులలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రారంభంలో టీజర్ లాంచ్ జరగనున్నట్లు ప్రచారం జరిగింది.
తీరా చూస్తే “ఆది పురుష్” ఫోటో మాత్రమే విడుదల కావడం జరిగింది. కేవలం పోస్టర్ తోనే సరిపెట్టడంతో అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. విజువల్ గ్రాఫిక్స్ వర్క్ జూన్ నెలకి కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు లేదని మరోపక్క ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో సినిమా ఇంకా ఆలస్యమైతే… మరో ఏడాది వేస్ట్ అయిపోతుందని అభిమానులు కలవర పడుతున్నారు. “ఆది పురుష్” సినిమా దాదాపు గ్రాఫిక్స్ వర్క్ పైన చిత్రీకరించిన సినిమా కావటంతో… ఆలస్యమయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీరామనవమి నాడు విడుదల చేసిన పోస్టర్ కూడా పెద్దగా… ఆకట్టుకోకపోవడంతో “ఆది పురుష్” ఫలితం పై అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమా ఫలితం అటో ఇటో అయితే వరుసగా మూడు ఫ్లాపులు పడతాయని… డార్లింగ్ ఫాన్స్ తెగ మదన పడుతున్నారు.
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
This website uses cookies.