Bro Movie Review : రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఏడాదికి ఒక్క సినిమా చేసినా ఆయనకు అభిమానులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో విడుదలయ్యే ప్రతి సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ‘ బ్రో ‘ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏ సినిమా జూలై 28న విడుదల కాబోతుంది. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ Sai Dharam Tej లీడ్ రోల్ చేశారు. అయినా ఇది పవన్ కళ్యాణ్ సినిమా లాగా నే ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే దీనికి కొంచెం హైప్ తక్కువగా ఉంది. అందుకు కారణం ఈ సినిమా క్లాస్ మూవీ కావడం, పవన్ చేసింది మాస్ పాత్ర కాకపోవడం ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పాటలు కూడా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా బుకింగ్స్ మొదలుపెట్టడం కూడా కొంచెం లేట్ అవ్వడంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న సందేహాలు వచ్చాయి. కానీ బుధవారం ఆ సందేహాలన్నింటికి తెరపడిపోయింది. విడుదలకు రెండు రోజుల ముందు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ మొదలైపోయాయి. ఉదయం నుంచి టికెట్లు అమ్మకాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి.
పవన్ గత సినిమాలు నిమిషాల్లో టిక్కెట్లు అయిపోయే పరిస్థితి ఉండేది కానీ ఈ సినిమాకి అంతగా లేకపోయినా బుకింగ్స్ జోరుగానే నడుస్తున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నిడివి రెండు గంటల 15 నిమిషాలు మాత్రమే ఉంది. దీంతో ఎనిమిది గంటలకు ఆ తర్వాతే షోలు పడబోతున్నాయి. రెండు రాష్ట్రాలలో తొలి వీకెండ్లో ఐదు షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక సినిమా టికెట్లు కూడా ఎక్కడ పెంచలేదు. రెగ్యులర్ రేట్లకి అమ్మకాలు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా రేట్ల పెంపు కోసం ప్రయత్నించినట్లు కనిపించడం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.