Bullet Bandi Fame : ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి ఫేమ్ భ‌ర్త‌.. లంచం తీసుకుంటూ!

Authored By mallesh | The Telugu News | Published on: September 21, 2022, 2:00 pm

Bullet Bandi Fame : అతనొక ప్రభుత్వ అధికారి.లక్షల్లో జీతం ఉంటుంది. కానీ అక్రమ సంపాదన మోజులో పడి ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఇంకేముంది జీవితం బుగ్గిపాలు. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం కామన్. ఏసీబీకి చిక్కడం కూడా కామన్ అయిపోయిందని చాలా మంది చెప్పుకుంటున్నారు.వీరు తమకు వచ్చే జీతం కంటే అక్రమంగా చాలా సంపాదిస్తున్నారని బయట టాక్.

Bullet Bandi Fame : తన భార్య వల్లే ఫేమస్..

హైదరాబాద్‌లోని బడంగ్ పేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ ఇంటికి సంబంధించిన అనుమతి మంజూరు చేసేందుకు యాజమాని దగ్గర లంచం డిమాండ్ చేసిన అశోక్.. సరిగ్గా డబ్బులు తీసుకుంటున్న టైంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

Bullet Bandi Fame Husband Ashok Caught To ACB

Bullet Bandi Fame Husband Ashok Caught To ACB

దీంతో అతని ఇంట్లో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా అశోక్ ప్రభుత్వ అధికారి అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ గతంలో తన భార్య వలన అతను ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయాడు. దీనికి కారణం అతని పెళ్లి రోజున తన భార్య బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేయడమే.

అప్పగింతల సమయంలో అశోక్ భార్య .. సింగర్ మోహన భార్గవి పాడిన సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ జంట ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. వీరిని పలు టీవీ చానెళ్లు కూడా ఇంటర్వ్యూ చేశాయి. వీరిద్దరిని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలిసేలా చేసింది బుల్లెట్ బండి సాంగ్‌కు పెళ్లికూతురు డ్యాన్స్ చేసిన వీడియో.. కాగా, ఇప్పుడు అశోక్ ఏసీబీకి దొరకడంతో ఆ ఫేమ్ ఒక్కసారిగా పోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నాురు..

Also read

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp