Home » Entertainment » Bullet Bhaksar Father Abusive Comments In Sridevi Drama Company Skit
Entertainment

Bullet Bhaksar : నోరు జారిన బుల్లెట్ భాస్కర్ తండ్రి.. షోలో స్టేజ్ మీదే దారుణమైన బూతు

Authored By
aruna
The Telugu News | Published on: August 2, 2022, 6:20 pm
Advertisement

Bullet Bhaksar : బుల్లెట్ భాస్కర్ తన తండ్రిని ఏ ముహూర్తాన తెరకు పరిచయం చేశాడో గానీ ఆ క్షణం నుంచి దూసుకుపోతూనే ఉన్నాడు. బుల్లెట్ భాస్కర్ కంటే ఆయన తండ్రే ఎక్కువగా ఫేమస్ అవుతున్నాడు. ఊర్లోని మనుషులు ఎలా ఉంటారు.. ఎంత నిస్వార్థంగా ఉంటారు.. ఎలా సరసాలు ఆడుతుంటారు.. అన్నీ కూడా బుల్లెట్ భాస్కర్ తండ్రి చేసి చూపిస్తున్నాడు. ఇక అక్రమ సంబంధాల విషయంలో బుల్లెట్ భాస్కర్ తండ్రి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంటాడు.నిజంగానే భాస్కర్ నలుగురిని మెయింటైన్ చేస్తున్నట్టుగా, తానేదో ఇద్దరిని చేస్తే తప్పేంటన్నట్టుగా ప్రశ్నిస్తుంటాడు. ఇదంతా స్క్రీన్ మీద కామెడీ కోసమే అయినా పదే పదే అవే డైలాగ్స్ కొడుతుండటంతో జనాలు కూడా వాటిని నమ్మే పరిస్థితి వస్తుంది. ఇక బుల్లెట్ భాస్కర్ తండ్రి ఎక్కువగా తెర మీదకు వస్తున్నాడు.

Advertisement

శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆయన్ను స్పెషల్‌గా తీసుకుంటున్నారు. ఆయనకు డైలాగ్స్ రాస్తున్నారు. స్కిట్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆదివారం నాడు ప్రసారం చేసిన ఎపిసోడ్‌లో బుల్లెట్ భాస్కర్ తండ్రి దుమ్ములేపేశాడు. ఆది, రాం ప్రసాద్ వేసిన స్కిట్లో బుల్లెట్ భాస్కర్ హద్దులు దాటేశాడు. స్టేజ్ మీద నోరు పారేసుకున్నాడు. గడ్డివాము వెనకాల అంటూ ఓ స్కిట్ వేశారు ఆది, రాం ప్రసాద్. ఇక ఇందులో ఆదికి జోడిగా వర్ష, రాం ప్రసాద్ జోడిగా ఫైమా ఉంటుంది. నరేష్‌కు జోడిగా సుజాత వస్తుంది. వర్షతో హాయిగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఉంటాడు ఆది. ఇంకా ఎంత సేపు.. నాకేమో అక్కడ ఫైమాను ఇచ్చారు చూడలేకపోతోన్నా అని ఆది వర్షజోడిని డిస్టర్బ్ చేస్తాడు రాం ప్రసాద్.

Bullet Bhaksar Father Abusive Comments in Sridevi Drama Company SKit

Advertisement

ఇక నరష్ తన జోడి అయిన సుజాతను పట్టుకొస్తాడు. వీళ్లంతా ఇలా గడ్డివాము వెనక అంటూ స్కిట్లు చేస్తుంటారు. ఇక తాపీగా శాంతి స్వరూప్‌తో గడ్డివాము వెనక నుంచి బుల్లెట్ భాస్కర్ తండ్రి వస్తాడు. మీరేంటి? ఇక్కడి నుంచి వచ్చారు అని ఆది అడుగుతాడు. వాళ్లు వచ్చి దె** అని పచ్చి బూతులు నోరు జారి మాట్లాడతాడు. దీంతో అందరూ నోరెళ్లబెడతారు. అలాంటివి మాట్లాడొద్దన్నట్టుగా ఆది సైగ చేస్తాడు. అంతటితో సీన్ అక్కడికి కట్ చేసేస్తారు. అలా మొత్తానికి బుల్లెట్ భాస్కర్ తండ్రి మాత్రం తెరపై అప్పడప్పుడు అదుపుతప్పుతుంటాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి