Celebrity Couple : ఆ జంట విడాకులు తీసుకోబోతుందా.. కోర్టు మెట్లెక్కడానికి కారణం ఏంటి ?
ప్రధానాంశాలు:
Celebrity Couple : ఆ జంట విడాకులు తీసుకోబోతుందా.. కోర్టు మెట్లెక్కడానికి కారణం ఏంటి ?
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో ఏదో ఒక గొడవ జరగడం వలన వారు విడిపోతున్నారు.ఇప్పుడు కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ ఫేమస్ అయిన యష్, ఆయన భార్య కోర్టు మెట్లెక్కడంతో వారిద్దరి మధ్య ఏం జరిగింది, విడిపోతున్నారా అనే సందేహం అందరి మదిలో మెదులుతుంది. వివరాలలోకి వెళితే ఈ జంట కలిసి ఓ యాడ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కోర్టు మెట్లెక్కారు. యశ్ లాయర్ ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ కోసం ఒక ప్రకటన చేశారు. ఇందులో యశ్ వైఫ్ రాధికా పండిట్ మోసపోయిన కస్టమర్ పాత్రలో నటించింది. కాగా కంపెనీ యొక్క నిజమైన వంట నూనెను నిరూపించడానికి యశ్ వాదించాడు.
Celebrity Couple కోర్టు మెట్లెక్కడానికి కారణం..
ఈ రియల్ లైఫ్ కపుల్ రీల్ లైఫ్ లో కోర్టు మెట్లెక్కడంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే యాడ్ కోసమని తెలిసి చల్లబడ్డారు. ఇక కేజీఎఫ్ ఫేమ్, పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నది. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుపుకుంటున్నది. కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మధ్య వివాదం కొనసాగుతున్నది. అయితే, అటవీ-పర్యావరణ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అదనపు ప్రధాన కార్యదర్శికి ఈ విషయంపై లేఖ రాశారు. ఈ భూమి ప్రస్తుతం హిందుస్థాన్ మెషిన్ టూల్స్ ఆధీనంలో ఉన్నది. వాస్తవానికి ఈ రిజర్వ్ ఫారెస్టు భూములను గెజిట్ నోటిఫికేషన్‌లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండానే హెచ్‌ఎంటీకి ఇచ్చారు.
భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది. వ్యాపార అవసరాల కోసం హెచ్‌ఎంటీ భూమిని అద్దెకు ఇస్తుంది. ఈ క్రమంలోనే ‘టాక్సిక్’ మూవీ షూటింగ్ కోసం లీజుకు ఇచ్చారు. అయితే, మూవీ భారీ సెట్ కోసం అటవీ భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలున్నాయి. ‘టాక్సిక్’ మూవీ 1970 గోవా, కర్ణాటక బ్యాగ్ డ్రాప్ లో ఉండబోతుందట. కేజీఎఫ్ తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్నాడు హీరో యష్. మరి ఈ సినిమాలో మనోడు ఎలాంటి అవతార్‌లో కనిపించబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి, కరీనాకపూర్, శ్రుతిహాసన్, కియారా అడ్వాణీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు హీరోయిన్‌గా నటించే ఛాన్సెస్ ఉన్నాయిఏది ఏమైనా సినిమా రిలీజ్ కి ముందే ఇన్ని వివాదాలాలు వస్తున్నాయి.. రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుందో అంటూ సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. celebrity couple who climbed the steps of-the court, what is the reason