Celebrity Marriages : ప్రేమ పేరుతో స్టార్ హీరోలను పట్టేసిన హీరోయిన్స్.. ఈ లిస్టులో ఎవరెవరున్నారంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Celebrity Marriages : ప్రేమ పేరుతో స్టార్ హీరోలను పట్టేసిన హీరోయిన్స్.. ఈ లిస్టులో ఎవరెవరున్నారంటే?

Celebrity Marriages : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమ వివాహాలు చాలానే జరిగాయి. కొందరిది చైల్డ్ హుడ్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న వారిలో కొందరు నటులు తమ కోస్టార్స్‌ను ప్రేమించి పెళ్లాడారు. ఇప్పటికీ కూడా తమ భార్యలతో సంతోషంగా కలిసి ఉంటున్నారు. ఆనాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్‌లో కొందరు విడాకులు తీసుకుని మరోపెళ్లి చేసుకుంటే.. కొందరు మాత్రం తమ ప్రేమను భద్రంగా కాపాడుకుంటున్నారు. అయితే, స్టార్ హీరోస్‌ను పెళ్లాడిన […]

 Authored By mallesh | The Telugu News | Updated on :19 September 2022,2:00 pm

Celebrity Marriages : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమ వివాహాలు చాలానే జరిగాయి. కొందరిది చైల్డ్ హుడ్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న వారిలో కొందరు నటులు తమ కోస్టార్స్‌ను ప్రేమించి పెళ్లాడారు. ఇప్పటికీ కూడా తమ భార్యలతో సంతోషంగా కలిసి ఉంటున్నారు. ఆనాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్‌లో కొందరు విడాకులు తీసుకుని మరోపెళ్లి చేసుకుంటే.. కొందరు మాత్రం తమ ప్రేమను భద్రంగా కాపాడుకుంటున్నారు. అయితే, స్టార్ హీరోస్‌ను పెళ్లాడిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. టాలీవుడ్‌తో పాటు చాలా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.

అందులో అక్కినేని కుటుంబంలో ఏకంగా తండ్రి కొడుకులు ముందు వరసలో ఉన్నారు. మెగాఫ్యామిలీ నుంచి పవర్ స్టార్, తమిళంలో సూర్య, మహేశ్ బాబు ఇలా చాలా మంది ఉన్నారు.ఇక బాలీవుడ్‌ విషయానికి వస్తే ఆ లెక్క చెప్పడం చాలా కష్టం.. మొన్నటికి మొన్న రణవీర్-దీపిక.. విక్కీకౌశల్-కత్రినాకైఫ్ మ్యారేజ్ అవ్వగా.. తాజాగా రణబీర్ కపూర్-అలియాభట్ వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున-అమలది తొలి లవ్ స్టోరీ అంటుంటారు. ఎందుకంటే అప్పటికే నాగ్ కు వివామైంది కొడుకు కూడా ఉన్నాడు. వారు డివర్స్ తీసుకున్నాక.. శివ సినిమా టైంలో నాగ్ అమలను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.అమల కూడా నాగ్‌ను చూడగానే పడిపోయినట్టు తెలిపింది.

Celebrity Marriages : షూటింగ్ స్పాటే పరిచయ వేదిక..

ఇక పవన్ కళ్యాణ్-రేణుదేశాయ్ విషయానికొస్తే వీరు కూడా జానీ సినిమా టైంలో లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక మహేశ్ బాబు – నమ్రత..వంశీ సినిమా షూటింగ్ టైంలో లవ్ చేసుకున్నారు. ఇంట్లో తమ విషయం చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం నేటికి సంతోషంగా సాగుతోంది. ఇక టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత.. ఏం మాయచేశామే టైంలో పరిచయం అయ్యారు. తొలి చూపులోనే సామ్ చైతూను మెస్మరైజ్ చేసింది.పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. కానీ మనస్పర్దల కారణంగా విడిపోయారు. తమిళ మీరో సూర్య – జ్యోతిక లవ్ స్టోరీ సూపర్ అని అంటారు. వీరు 1999లో పూవెల్లం కెట్టుప్ప‌ర్ సినిమా షూటింగ్ లో క‌లుసుకున్నారు. అప్పుడే ప్రేమ‌లో ప‌డ‌గా 2006లో వివాహం చేసుకుని సౌత్‌లో లవ్లీ క‌పుల్‌గా గుర్తింపు పొందారు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది