Home » Entertainment » Chalaki Chanti On Auto Ram Prasad About Sudigali Sudheer
Entertainment

Chalaki Chanti : సుధీర్‌ను ఎలా పంపించారో నాకు తెలుసు.. రాం ప్రసాద్‌పై చలాకి చంటి ఆరోపణలు

Authored By
aruna
The Telugu News | Published on: August 29, 2022, 1:40 pm
Advertisement

Chalaki Chanti : సుధీర్ ఇప్పుడు మల్లెమాలకు దూరంగా ఉంటున్నాడు. జబర్దస్త్ షోనుంచి వెళ్లిపోయాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలు ఇలా అన్నింటిని వదిలేసి వెళ్లాడు. ఎందుకు వెళ్లాడన్నది ఇంత వరకు క్లారిటీ రాలేదు. రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి వెళ్లి ఉంటాడని ఆది, రాం ప్రసాద్‌లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే రష్మీ అప్పుడప్పుడు తన స్కిట్లలో భాగంగా సుధీర్‌ను ఎలా పంపించారో నాకు తెలుసు అని ఆది, రాం ప్రసాద్‌ల మీద కౌంటర్లు వేస్తూ ఉంటుంది. తాజాగా చలాకి చంటి కూడా అదే రకమైన కౌంటర్లు వేశాడు. కప్పల పెళ్లి అంటూ ఆదివారం నాడు ఈవెంట్ నిర్వహించింది శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం. ఇందులో భాగంగా ఊరి జనం అంటూ జబర్దస్త్ టీం అంతా కూడా వచ్చింది.

Advertisement

నేటి ఎపిసోడ్‌లో కాస్త జబర్దస్త్ వాసన కొడుతుంది.. అందరూ అక్కడి వాళ్లే వస్తారు అన్నట్టుగా ఆది చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో భాగంగా చలాకీ చంటి, రాఘవ ఇలా అందరి గురించి ఎంట్రీ చెబుతాడు ఆది. ఈ మధ్య ఐశ్వర్య అని ఒకాయన కలవరిస్తుంటాడు అతను రాఘవ అని పరువుతీసేశాడు ఆది. అయితే అందరి కంటే ముందు ఆ గ్యాంగులో బుల్లెట్ భాస్కర్ మాట్లాడేశాడు. చూశావా? అన్నా.. అందరి కంటే సీనియర్ నువ్వే అయినా కూడా.. వాడికి డైలాగ్స్ ఇవ్వకపోయినా వాడే మాట్లాడుతున్నాడు అంటూ బుల్లెట్ భాస్కర్ గురించి చలాకీ చంటికి ఆది చెప్పుకొచ్చాడు.

Chalaki Chanti On Auto Ram Prasad About Sudigali Sudheer

Advertisement

అందుకే నువ్ మాతో పాటు ఉండు అన్నా.. వాడ్ని వదిలేయ్ అంటూ రాం ప్రసాద్ పక్కకు వచ్చి చేరతాడు. మీరు మీతో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఫ్రెండ్‌నే ఎలా బయటకు పంపించారో నాకు తెలుసు.. మళ్లీ మీతో చేరితో.. బుల్లెట్ భాస్కర్ చేసిన దారణం కంటే మీరు చేసే దారుణాలే ఎక్కువగా ఉంటాయ్ అని రాం ప్రసాద్ మీద కౌంటర్లు వేశాడు చంటి. అంటే కావాలనే సుధీర్‌ను బయటకు పంపించేశారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కలిసి బ్యాక్ గ్రౌండ్‌లో ఏదైనా చేశారా? అందుకే సుధీర్ ఇలా మల్లెమాల నుంచి బయటకు వచ్చేశాడా? అన్నది అర్థం కావడం లేదు. మొత్తానికి సుధీర్ మళ్లీ తిరిగి వస్తాడా? అన్నది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి