
Jabardasth Chalaki Chanti Present Health Condition
Jabardasth Chalaki Chanti : చలాకి చంటి..ఈ కమెడీయన్ ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా డైరెక్ట్‌గా మాట్లాడుతుంటారు. ఆయన వేసే పంచెస్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ‘జబర్దస్త్’ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుని సినిమాల్లో అవకాశాలు అందుకుంటు చలాకీ చంటి ప్రస్తుతం వేరే షోస్‌లో పాల్గొంటున్నారు. అయితే ఒకప్పుడ జబర్ధస్త్ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన వారందరు ఇప్పుడు జబర్ధస్త్ తో పాటు మల్లెమాలని తిడుతుండడం విశేషం. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ కమెడియన్లు పరోక్షంగా జబర్దస్త్ పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అనసూయ సైతం.. ‘ 2 ఏళ్లుగా జబర్దస్త్ నుండి బయటకి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నట్టు,అలాగే అక్కడి బాడీ షేమింగ్ కామెంట్లు, వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులు భరించలేకపోయేదాన్ని’ ఆమె కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చలాకి చంటి కూడా ఇప్పుడు తనకున్న పాపులారిటీ ‘జబర్దస్త్’ వల్ల వచ్చింది కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా చలాకి చంటికి ఓ ప్రశ్న ఎదురైంది.
‘జబర్దస్త్’ ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు పెద్దగా రావని, సినిమాల విషయంలో ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు మోసపోతుంటారు, స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఉన్న పాత్ర నిడివి సెట్స్‌పైకి వెళ్ళాక ఉండదని అంటుంటారు అది నిజమేనా?’ అంటూ యాంకర్ అడిగింది.దీనికి సంబంధించిన చలాకీ చంటి.. జబర్దస్త్ వలన నా పేరు రాలేదు. నేను సినిమాలు చేసిన జబర్దస్త్ షోకు వచ్చా. సినిమాలు తెలియకుండా జబర్దస్త్‌కు వచ్చిన వాళ్లకు అలా జరిగి ఉండవచ్చేమో. నేను అప్పటికే 20 సినిమాలు చేశాను. నాకు తెలుసు. స్కిట్ వేరు.. సినిమా సీన్ వేరు. డైరెక్టర్ చెప్పిన నా పాయింట్ నాకు అర్థమవుతుంది. సీన్ల విషయంలో నా ఐడియాలు కూడా పంచుకుంటా. నేను మూడుసార్లు జబర్దస్త్ షోకు బయటకు వెళ్లి వచ్చా. ఎవరైనా బయటకు వెళితే మళ్లీ ఆ షోలోకి తీసుకోరు. ఇది వాళ్ల రూల్. అయితే వాళ్లు నాకు గౌరవం ఇచ్చారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఏది ఉన్నా.. ఏ తప్పు జరిగినా.. అప్పటికప్పుడే అడుగుతా. నానబెట్టి తరువాత అడగడం నాకిష్టం ఉండదు.
chalaki chanti stunning comments about bigg boss
ఈ విషయం అందరికీ తెలిసింది. ఒకసారి మూడు నెలల గ్యాప్ తీసుకుంటానని చెప్పి వెళ్లా. కంటిన్యూగా చేయడంతో తలనొప్పిగా అనిపిస్తుందని రెస్ట్ తీసుకుని వచ్చా. రెండోసారి నా పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో వెళ్లి వచ్చా. మూడోసారి 27 రోజులు యూఎస్ షెడ్యూల్‌లో షూటింగ్ ఉండడంతో వెళ్లి వచ్చా. ఎవరి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు..’ అంటూ చలాకి చంటి చెప్పుకొచ్చాడు. ఇక బిగ్ బాస్ సీజన్-6కు చలాకి చంటి ఎంట్రీ కన్ఫార్మ్ అయింది. ఇప్పటికే చంటి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళతాడని చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల చంటి కూడా హింట్ ఇచ్చినా.. కచ్చితంగా వెళుతున్నట్లు చెప్పలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి.. యాంకర్ రోషన్‌తో జబర్దస్త్ షో గురించి మాట్లాడారు. ఈ క్రమంలో యాంకర్ మాట్లాడుతూ.. చంటి చాలా తెలివైన వ్యక్తి అని.. ఇదే తెలివిని బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఉపయోగించాలని అన్నాడు. దీంతో చంటి బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇస్తు్న్నట్లు రోషన్ నోరు జారి కన్ఫార్మ్ చేశాడు.
రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే నెపంతో ఒక యువకుడిని…
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత సుఖీభవ…
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
This website uses cookies.