
Liger Moive Getting Negative Talks By Fans Of Other Hero
Liger Movie : విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లైగర్. ఈ సినిమా ఇటీవలి కాలంలో తెగ చర్చనీయాంశంగా మారింది. మరో మూడు రోజులలో చిత్రం విడుదల కానుండగా, చిత్ర టీమ్ నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం అడ్వాన్స్ బుక్కింగ్ లు జోరుగా సాగుతున్నాయి. 20వ తేదీ నుంటి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఈ చిత్రం ఓపినింగ్స్, కలెక్షన్స్ పై అందరి దృష్టీ ఉంది. అయితే ఈ విషయంలో లైగర్ మాత్రం దూసుకెళ్తోంది.మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో లైగర్‌కు రూ.1.7 కోట్లు వచ్చాయి.
ఇందులో చాలా వరకూ తెలుగు వెర్షన్ కు సంభందించినవే. దేశవ్యాప్తంగా మొత్తం 90 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. హిందీ బెల్ట్‌లో మాత్రం లైగర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన రేంజ్‌లో లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. అయితే అక్కడ బోయ్ కాట్ లైగర్ ట్రెండ్ నడుస్తోంది. కానీ ప్రస్తుతం అక్కడ కూడా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో టాక్ ని కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాతోనే విజయ్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బాలీవుడ్ డైరక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకు అలాగే పూరి జగన్నాథ్ కు కూడా ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనివిధంగా వీరు ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశారు అనే చెప్పాలి.
Liger Movie advance booking crazy
2019లో స్టార్ట్ అయిన ఈ సినిమా అనేక రాక ఒడిదుడుకులను దాటి మొత్తానికి ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్ లో కూడా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అనే వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే లైగర్ సినిమా అత్యధిక బిజినెస్ చేయడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ అయితే చేసింది. మొదటి నుంచి కూడా లైగర్ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో పోటీపడి రిలీజ్ హక్కులను దక్కించుకున్నారు. తప్పకుండా సినిమా మొదటి రోజు ఉహాలకందని రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కూడా అనుకుంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.