balakrishna and anil ravipudi movie budget cuttings issue
Balakrishna : అఖండ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్స్ బంద్ లేకుండా ఉంటే ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి అయ్యేది. కాని సెప్టెంబర్ వరకు ఇప్పుడు షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. ఇక బాలయ్య తదుపరి సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన విషయాలు బాలయ్య అభిమానులతో పాటు ఇండస్ట్రీ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హీరోగా బాలయ్య ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు. కనుక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం మొన్నటి వరకు ఏకంగా 70 నుండి 75 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం ఆ బడ్జెట్ ను 55 నుండి 60 కోట్ల కు తగ్గించాలని నిర్మాణ సంస్థ దర్శకుడు అనిల్ రావిపూడికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో మాదిరిగా అనిల్ రావిపూడి అపజయం ఎరుగని దర్శకుడు కాదు.. కనుక ఆయన దర్శకత్వంలో బాలయ్య హీరోగా అంత బడ్జెట్ అంటే రిస్క్ చాలా ఎక్కువగా కనిపిస్తుందని అందుకే బడ్జెట్ కుదింపు చేయాలని నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారట.
balakrishna and anil ravipudi movie budget cuttings issue
ఈ సినిమా ను సాహు గారపాటి మరియు హరీష్ పెద్దిలు కలిసి నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం మొదట అనిల్ రావిపూడి చెప్పిన బడ్జెట్ కు ఓకే చెప్పిన వారు ఇప్పుడు మాత్రం బడ్జెట్ కుదింపు విజ్ఞప్తి చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. నిర్మాతలను మార్చేయాలా లేదంటే వారితోనే కంటిన్యూ అయ్యి కొత్తగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి సినిమా బడ్జెట్ ను కుదించాలా అనే విషయంలో దర్శకుడు ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య మాత్రం కాస్త బడ్జెట్ కుదించుకోమనే సలహా ఇస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాలయ్య 108 సినిమా ఇప్పుడు ఎఫ్ 3 కారణంగా బడ్జెట్ కత్తిరింపుకు గురి అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.