Chalaki chanti : జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి సీజన్-6 నుంచి రీసెంట్‌గా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఐదు వారాల పాటు షోలో ఉన్న చంటి ఎందుకు బయటకు వచ్చాడో అని చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చంటిని బయటకు పంపించడానికి అనేక కారణాలు ఉన్నాయట.. ఒకటి గేమ్ విషయంగా మనోడి మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉండగా.. మరొకటి రెమ్యూనరేషన్ విషయం అని కూడా అంటున్నారు విశ్లేషకులు. బజర్దస్త్ షో చలాకీ చంటి సుధాకర్ కలిసి ఓ రేంజ్లో కామెడీని పండిస్తుంటారు. సుధాకర్ గతంలో చంటి స్కిట్‌లో చేయగా.. ఈ మధ్యకాలంలో బుల్లెట్ భాస్కర్ టీంలో కూడా కనిపిస్తున్నాడు.
కొంతకాలం జబర్దస్త్ కు దూరమైన చంటి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి తోడు బుల్లితెరపై పలు ఈవెంట్స్, షోస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోడికి బిగ్ బాస్ సీజన్-6లో అవకాశం దక్కింది. హౌస్‌లో ఈ సీజన్ చాలా డల్ పర్ఫామెన్స్ అందిస్తోందని అందరూ అంటున్నారు. ఈ సీజన్‌లో జనాలు గుర్తుపట్టే మొహాలు పెద్దగా లేకపోవడమే బిగ్‌బాస్ షోకు ఇబ్బందికరంగా మారింది. జనాల్లో ఈ షో మీద క్రమంగా ఆసక్తి తగ్గుతోందని కొందరు చెబుతున్నారు. గత సీజన్లలో రేటింగ్స్ పరంగా కూడా బిగ్ బాస్ మంచి విజయాన్ని అందుకుంది. అభిమానుల నుంచి కూడా ఈ షోకు మంచి ఆదరణ లభించేది.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయ్యాయి. ఈసారి 21 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా అందులో ఐదుగురికి పైగా బయటకు వెళ్ళారు.అందులో చలాకీ చంటి కూడా ఒకరు.ఈయన హౌస్‌లో గేమ్స్, టాస్కులు కంప్లీట్ చేయకుండా ఉండేవాడట. డబ్బులు తీసుకుంటూ ఇతరులతో గొడవపడి, టాస్కులు చేయడం, గేమ్స్ ఆడటం వంటివి చేయకుండా ఉండేందుకు బిగ్ బాస్ లోకి పిలిపించలేదు. చంటి కావాలనే సభ్యులతో మాట్లాడుకుంటూ టైం పాస్ చేశాడు తప్పా గేమ్ ఆడలేదని కొందరు సభ్యులు కూడా చెబుతున్నారు. అందుకే మనోడిని హౌస్ నుంచి బయటకు పంపిచారు. కానీ ఐదువారాల పాటు షోలో ఉన్నందుకు రూ.10లక్షలు చార్జ్ చేశాడట. అందరి కంటే చంటికే ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.