Chalaki Chanti : బిగ్‌ బాస్‌ను గట్టిగా వాడేసిన చలాకీ చంటి.. ఐదు వారాలకే అంత కలెక్ట్ చేశాడా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :12 October 2022,4:30 pm

Chalaki chanti : జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి సీజన్-6 నుంచి రీసెంట్‌గా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఐదు వారాల పాటు షోలో ఉన్న చంటి ఎందుకు బయటకు వచ్చాడో అని చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చంటిని బయటకు పంపించడానికి అనేక కారణాలు ఉన్నాయట.. ఒకటి గేమ్ విషయంగా మనోడి మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉండగా.. మరొకటి రెమ్యూనరేషన్ విషయం అని కూడా అంటున్నారు విశ్లేషకులు. బజర్దస్త్ షో చలాకీ చంటి సుధాకర్ కలిసి ఓ రేంజ్లో కామెడీని పండిస్తుంటారు. సుధాకర్ గతంలో చంటి స్కిట్‌లో చేయగా.. ఈ మధ్యకాలంలో బుల్లెట్ భాస్కర్ టీంలో కూడా కనిపిస్తున్నాడు.

కొంతకాలం జబర్దస్త్ కు దూరమైన చంటి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు.  దీనికి తోడు బుల్లితెరపై పలు ఈవెంట్స్, షోస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోడికి బిగ్ బాస్ సీజన్-6లో అవకాశం దక్కింది. హౌస్‌లో ఈ సీజన్ చాలా డల్ పర్ఫామెన్స్ అందిస్తోందని అందరూ అంటున్నారు. ఈ సీజన్‌లో జనాలు గుర్తుపట్టే మొహాలు పెద్దగా లేకపోవడమే బిగ్‌బాస్ షోకు ఇబ్బందికరంగా మారింది. జనాల్లో ఈ షో మీద క్రమంగా ఆసక్తి తగ్గుతోందని కొందరు చెబుతున్నారు. గత సీజన్లలో రేటింగ్స్ పరంగా కూడా బిగ్ బాస్ మంచి విజయాన్ని అందుకుంది. అభిమానుల నుంచి కూడా ఈ షోకు మంచి ఆదరణ లభించేది.

Chalaki Chanti who used Bigg Boss hard

Chalaki Chanti who used Bigg Boss hard

Chalaki chanti : గేమ్ ఆడమంటే అందరూ మనోళ్లే అనుకుంటూ..

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయ్యాయి. ఈసారి 21 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా అందులో ఐదుగురికి పైగా బయటకు వెళ్ళారు.అందులో చలాకీ చంటి కూడా ఒకరు.ఈయన హౌస్‌లో గేమ్స్, టాస్కులు కంప్లీట్ చేయకుండా ఉండేవాడట. డబ్బులు తీసుకుంటూ ఇతరులతో గొడవపడి, టాస్కులు చేయడం, గేమ్స్ ఆడటం వంటివి చేయకుండా ఉండేందుకు బిగ్ బాస్ లోకి పిలిపించలేదు. చంటి కావాలనే సభ్యులతో మాట్లాడుకుంటూ టైం పాస్ చేశాడు తప్పా గేమ్ ఆడలేదని కొందరు సభ్యులు కూడా చెబుతున్నారు. అందుకే మనోడిని హౌస్ నుంచి బయటకు పంపిచారు. కానీ ఐదువారాల పాటు షోలో ఉన్నందుకు రూ.10లక్షలు చార్జ్ చేశాడట. అందరి కంటే చంటికే ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి