Home » Entertainment » Chammak Chandra Cine Industry Struggle In Mana Oori Rangasthalam
Entertainment

Chammak Chandra : చమ్మక్ చంద్ర కష్టాలు.. రూ. 1500లతో ఇండస్ట్రీలోకి

Authored By
aruna
The Telugu News | Published on: September 3, 2022, 10:00 pm
Advertisement

Chammak Chandra : చమ్మక్ చంద్ర పేరుకి పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్ షో ప్రారంభం కాక ముందే.. సినీ ఇండస్ట్రీలోకి చమ్మక్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు. సైడ్ ఆర్టిస్ట్‌గా, జూనియర్ ఆర్టిస్ట్‌గా చమ్మక్ చంద్ర ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ జబర్దస్త్ స్టేజ్ మీద చంద్రకు గుర్తింపు వచ్చింది. చమ్మక్ చంద్రగా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు జబర్దస్త్ షోకు ఫేస్ ఆఫ్ క్రేజ్‌లా మారిపోయాడు. చంద్ర చేసే ప్రతీ స్కిట్ అద్భుతంగా పేలిపోయేది. నాగబాబుకు అత్యంత ఇష్టుడిగా మారిపోయాడు. అలా చమ్మక్ చంద్ర అతి తక్కువ కాలంలోనే స్టార్‌గా మారిపోయాడు.

Advertisement

బుల్లితెరపై చమ్మక్ చంద్ర క్రేజ్ అలా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే నాగబాబు.. మల్లెమాలను వదిలి జబర్దస్త్ షోకు దూరంగా వచ్చాడో అప్పటి నుంచి చంద్ర కూడా బయటకు వచ్చాడు. నాగబాబుతో కలిసి అదిరింది, బొమ్మ అదిరింది అంటూ షోలను చేసుకుంటూ ఉండిపోయాడు. అలా మొత్తానికి చమ్మక్ చంద్ర ఇప్పుడు బుల్లితెరపై, వెండితెరపై మంచి ఫాంలో ఉన్నాడు. చంద్ర ఎక్కువగా సినిమాలతోనే బిజీగా ఉంటున్నాడు. చంద్రకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కమెడియన్ రోల్స్‌తో చంద్ర అదరగొట్టేస్తున్నాడు. చమ్మక్ చంద్ర ఎంత కష్టపడ్డాడో, ఎలా డబ్బులు సంపాదించి, దాచుకుని, ఇళ్లు కార్లు కొనుక్కున్నాడో ఓ సారి నాగబాబు చెప్పుకొచ్చాడు.

Chammak Chandra CIne Industry Struggle in Mana Oori Rangasthalam

Advertisement

అయితే తాజాగా చమ్మక్ చంద్ర తనకు కెరీర్ ప్రారంభంలో సాయం చేసిన వారి గురించి చెప్పుకొచ్చాడు. తాను ఇండస్ట్రీకి వస్తానంటూ.. మొదటగా రూ. 1500 ఇచ్చాడని.. అతడ్ని స్టేజ్ మీద అందరికీ పరిచయం చేశాడట. అలా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇంత ఎత్తుకు ఎదిగిన చమ్మక్ చంద్రకు.. జీ తెలుగు ప్రత్యేకంగా సత్కారం చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇదే ఈవెంట్‌లో రచ్చ రవి.. తన గురు భక్తిని చాటుకున్నాడు. చమ్మక్ చంద్ర కాళ్ల మీద పడిపోయాడు. తన ప్రేమను చాటుకున్నాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి