Chammak Chandra : జబర్దస్త్ షో ఎంతో మందిని స్టార్స్‌ను చేసింది. ఈ షో ద్వారా కొత్త కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దశాబ్దకాలంగా జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్‌లోనూ దూసుకుపోతోంది. మొదట్లో జబర్ధస్త్ మాత్రమే ఉన్న ప్రొగ్రామ్.. ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్‌గా మారి సేమ్ పాపులారిటీతో కొనసాగుతోంది. మల్లెమాల ప్రొడక్షన్ ఈ రెండు షో ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించారు. సొసైటీలో వారికి గుర్తింపును ఇచ్చారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, రాఘవతో పాటు మరికొందరు ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు. జబర్దస్త్ షోలో పనిచేసే యాంకర్స్ అనసూయ, రష్మికి ఏ రేంజ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. వీరికి ఏకంగా సినిమాల ఆఫర్లు తలుపుతట్టాయి.
జబర్దస్త్ షోలో తను ఎదుర్కొన్న నాగబాబు ఆ షో వదిలేసి జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది కమెడీ షోలో హోస్ట్‌గా చేరిపోయారు. అయితే, అక్కడ కూడా కొందరు కొత్త కమెడియన్స్‌తో షో ప్రారంభైంది. ఆ తర్వాత నాగబాబు పిలుపుమేరకు చమ్మక్ చంద్ర, ఆర్పీ అదిరింది షోలో చేరిపోయారు. తీరా చూస్తే అదిరింది షో నటులకు మంచిగానే చూసుకున్నా టీఆర్పీ రేటింగ్ రాక ఆ షోను పూర్తిగా మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అందులో యాక్ట్ చేస్తే చమ్మక్ చంద్ర పరిస్థితి దారుణంగా తయారైంది. బొమ్మ అదిరింది అనుకుంటూ చంద్ర జబర్దస్త్ వీడాడు. ఇప్పుడు అక్కడ షో బంద్ అయ్యింది. దీంతో మళ్లీ స్టార్ మా చానెళ్ల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది.
చంద్ర వెళ్లిపోయాక లేడి, ఫ్యామిలీ స్కిట్స్ కొట్టేవారు జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఆ స్థానం అలాగే పదిలంగా ఉంది. చంద్ర తిరిగి బ్యాక్ టు జబర్దస్త్ అనుకున్నాడట.. కానీ అతన్ని రానివ్వకుండా ఎవరో అడ్డుకుంటున్నారని తెలిసింది. చంద్ర స్థానంలో సత్తిపండు టీం తీసుకొచ్చినా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ టీమ్‌ను కూడా తీసేసింది మల్లెమాల బృందం. ఆర్పీ మాత్రం దర్శకత్వం టీంలో చేరిపోయాడు. చంద్ర ఇప్పుడు తిరిగి జబర్దస్త్ కు వెళ్లితే నాగబాబుకు వెన్నుపోటు పోడిచినట్టే అని కొందరు భావిస్తున్నారు. ఎవరు ఏ ప్రొగ్రామ్‌లో పాల్గొన్న డబ్బులు కోసమే అని ఆలోచించాలి. మరికొందరు మాత్రం చంద్ర జబర్ధస్త్ వెళ్లితే బాగుటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.