Chandoo Mondeti : నాగ చైతన్యలో ఇంత కసి ఉందా.. తండేల్ అతను తప్ప మరొకరు చేయలేరు..!

Authored By Rame Samhith | The Telugu News | Updated on : 30 January 2025, 5:00 pm
  •  Chandu Mondeti : నాగ చైతన్యలో ఇంత కసి ఉందా.. తండేల్ అతను తప్ప మరొకరు చేయలేరు..!

Chandoo Mondeti : అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్ లో చెందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే సాంగ్స్ తో సినిమా ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. దేవి శ్రీ పసాద్ సాంగ్స్ తోనే సినిమా ఇప్పటికే పాజిటివ్ వైబ్ తెచ్చుకుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ చందు మొండేటి తండేల్ సినిమా కోసం నాగ చైతన్య పడిన కష్టం గురించి చెప్పారు. నాగ చైతన్య తప్ప మరెవరు చేయలేరని అతనిలో ఎన్నాళ్ల నుంచో ఉన్న కసి బయటకు తీసుకొచ్చాడని అన్నాడు చందు మొండేటి. సో డైరెక్టర్ చెప్పిన మాటలని బట్టి చూస్తుంటే ఈసారి నాగ చైతన్య యాక్టింగ్ చించేశాడని అనిపిస్తుంది. ఇక చందు మొండేటి హీరోయిన్ సాయి పల్లవి గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె గురించి ఏం చెప్పగలం ఆమె నటనని చూస్తూ సంతోషించడం తప్ప అని అన్నారు.

Chandoo Mondeti : నాగ చైతన్యలో ఇంత కసి ఉందా.. తండేల్ అతను తప్ప మరొకరు చేయలేరు..!

Chandoo Mondeti : నాగ చైతన్యలో ఇంత కసి ఉందా.. తండేల్ అతను తప్ప మరొకరు చేయలేరు..!

Chandoo Mondeti : 100 కోట్ల సినిమా అయ్యేలా..

నాగ చైతన్య, సాయి పల్లవి లది ఆల్రెడీ హిట్ పెయిర్. లవ్ స్టోరీతో ఇద్దరు హిట్ అందుకున్నారు. సో తండేల్ తో ఈసారి మరింత భారీగా రాబోతున్నారు. నాగ చైతన్య కెరీర్ లో ఈ సినిమా మొదటి 100 కోట్ల సినిమా అయ్యేలా ఉందని అక్కినేని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. చందు మొండేటి కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్ కాగా మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఫిబ్రవరి 7న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ సినిమా బజ్ చూస్తుంటే ఆడియన్స్ కు అక్కినేని ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్ అందించేలా ఉంది. Chandoo Mondeti, Naga Chaitanya, Thandel, Sai Pallavi

Advertisement

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి