Pragathi : సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది ప్రగతి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ వివిధ రకాల పాత్రలను చేస్తూ వస్తుంది. ఎక్కువగా హీరో, హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్ లు చేసింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన ప్రగతి ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. తను ప్రతిరోజు జిమ్ములో చేసే వర్క్ అవుట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే చేసిన క్యారెక్టర్స్ ని మళ్లీ మళ్లీ వస్తున్నాయని అందుకే ఎక్కువగా సినిమాలు చేయడం లేదని అంటుంది ప్రగతి.
అయితే ఇప్పుడు చాలామంది 40 ఏళ్లు దాటాక కూడా వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అయిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి తన లైఫ్, కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ప్రగతి ఎలాగూ సింగిల్ గా ఉంటుంది కాబట్టి ఆమె రెండో పెళ్లి గురించి ఏమనుకుంటుందో అని యాంకర్ రెండో పెళ్లి గురించి అడిగింది. దానికి బదులుగా ప్రగతి పెళ్లి అనే దానికన్నా కంపానియన్ అంటే బెటర్. చాలాసార్లు నాకు ఒక తోడు ఉంటే బాగుండు అని అనిపించింది. అలాగే నాకు ఒక తోడు ఉంటే బాగుంటుంది
అని అనిపించిన నా మెచ్యూరిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా, అదిగాక సింగిల్ పర్సన్ దొరకడం అంటే చాలా కష్టం. కానీ రావాలను ఉంటే మాత్రం అది జరుగుతుందని నమ్ముతాను. అయితే నన్ను భరించడం చాలా కష్టం. ఎందుకంటే నేను కొన్ని విషయాలలో పర్టికులర్ గా ఉంటాను. నాకు ఇలాగే కావాలి అలానే ఉండాలి అని ఉంటుంది. నేను యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అడ్జస్ట్ అయ్యేదాన్ని కావచ్చు. ఇప్పుడైతే చాలా కష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రగతి చేసిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.