Chinmayi : అలాంటి ఫోటో ఇంటర్నెట్ లో పెట్టేశావు ఏంటి చిన్మయి ? ఇంకేమైనా ఉందా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chinmayi : అలాంటి ఫోటో ఇంటర్నెట్ లో పెట్టేశావు ఏంటి చిన్మయి ? ఇంకేమైనా ఉందా !

 Authored By sandeep | The Telugu News | Updated on :19 October 2022,5:30 pm

Chinmayi : సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది చిన్మ‌యి. మీటూ ఉద్య‌మం నుండి చిన్మ‌యి పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. అమ్మాయిల తరపున తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. సమస్య చెప్పుకున్న ఆడపిల్లకు ధైర్యమిస్తుంది. ఇక డైరెక్టర్ కమ్ హీరో రాహుల్.. చిన్మయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కొద్ది నెలల క్రితం కవలపిల్లలు జన్మించినట్లు ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అందుకు కారణం ప్రెగ్నెంట్‏గా ఉన్న ఫోటోస్ ఒక్కటి కూడా నెట్టింట షేర్ చేయకుండానే ఆమె త‌ల్లి అయింద‌నే స‌రికి స‌రోగ‌సి ద్వారా జ‌న్మనిచ్చి ఉంటుంద‌ని భావించారు.

ఈ క్ర‌మంలో చిన్మ‌యిని తెగ ట్రోల్ చేశారు. అయిన లైట్ తీసుకుంది. దీంతో కొంత స‌ద్దుమ‌ణిగింది.ఇక నయన్.. విఘ్నేష్ దంపతులు సరోగసి పద్దతితో పిల్లలకు జన్మనివ్వడంతో మళ్లీ చిన్మయి పై రూమర్స్ గుప్పుమన్నాయి. ఈ క్రమంలో చిన్మ‌యి త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. చిన్మయి తన కవల పిల్లలకు పాలు పడుతున్న ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో ఇద్దరికీ ఒకేసారి పాలిస్తూ కనిపిస్తోంది. పిల్లలు ఫీడింగ్ చేయడం ఇలా ఉంటుంది.. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. భుజాలు భిన్నమైన స్వరాన్ని కలిగి ఉంటాయి అని చిన్మయి ఈ పోస్టులో రాసుకొచ్చింది.

Chinmayi of picture put on internet

Chinmayi of picture put on internet

Chinmayi : ఇది క్లారిటీ..

ఇక నేను గర్భవతిగా ఉన్న ఫోటోలను షేర్ చేయకపోవడంతో అందరూ సరోగసి ద్వారా నాకు కవలలు పుట్టారా అని నాకు మేసేజ్ చేస్తున్నారు. వారు అనుకోవడంలో తప్పు లేదు. అది వారి అభిప్రాయం. కానీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్నాను. నా పిల్లల ముఖాలను కూడా నేను చూపించను. నా స్నేహితులు.. కుటుంబం గురించి నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను. మా పిల్లల ఫోటోస్ సోషల్ మీడియాలో ఉండవు అంటూ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది చిన్మయి. ఇకపోతే చిన్మయి తెలుగు తమిళ భాషల్లో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో చిన్మయి తన భర్త రాహుల్ తో కలిసి తొలిసారిగా వెండితెర మీద తళుక్కుమంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది