
Anasuya : చిన్న పిల్లాడితో పెదాలపై అనసూయ ముద్దు.. ఓ రేంజ్‌లో వార్నంగ్ ఇచ్చిన సింగర్...!
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటీవల వివాదాలతో వార్తలలో నిలుస్తుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం అనసూయ లేని పోని వివాదాలలో ఇరుక్కుంటుంది. హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం ఇచ్చి వార్తలలో నిలిచింది.
ఇక అనసూయ కొన్నేళ్ల క్రితం ఓ టీవీ షోకి హోస్ట్ చేయగా, అందులో ఒక చిన్న పిల్లాడిని ఇలా పెదాలపై ముద్దు పెట్టమని కోరింది. దీనిపై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా అడగడం సిగ్గుచేటని పేర్కొంది. పైగా ఆ షో లో ఉన్న ఆడియన్స్, పేరెంట్స్ కూడా.. ఆ పిల్లాడు ముద్దులు పెడుతుంటే కేరింతలు, క్లాప్స్ కొడుతుండటం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని పేర్కొంది. చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఉండటం సరైన పద్ధతి కాదని, ఇది అతని భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చింది.
Anasuya : చిన్న పిల్లాడితో పెదాలపై అనసూయ ముద్దు.. ఓ రేంజ్‌లో వార్నంగ్ ఇచ్చిన సింగర్…!
చిన్న పిల్లాడిని ఎత్తుకుని తన మొహం చూపించి.. ఇక్కడ ముద్దు పెట్టు.. అక్కడ ముద్దు పెట్టు అంటూ కిసెస్ అడగడం ఏంటి అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి కంటెంట్ తో టీవీ ఛానల్స్ లో కిడ్స్ షో లు, కామెడీ షో లు చేస్తుండటం చూస్తుంటే భయమేస్తుందని, సమాజం దీనిని ఎంతమాత్రం ప్రోత్సహించకూడదని చిన్మయి తెలిపింది. మీ పిల్లలకు ఏది మంచో ఏది చెడో చెప్పాల్సింది మీరేనని తల్లిదండ్రులకు సూచించింది. చిన్మయి పోస్ట్ పై నెటిజన్లు అలాగే స్పందిస్తున్నారు.2013-14 సంవత్సరాల్లో ఇది ప్రముఖ ఛానల్ లో టెలీకాస్ట్ అయింది. మరి చిన్మయి పోస్ట్ పై అనసూయ భరద్వాజ్ ఎలా స్పందిస్తుందో.. ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.