Chiranjeevi : తమ్ముడూ .. నీ ప్రసంగానికి నా మనసు ఉప్పొగింది – చిరంజీవి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : తమ్ముడూ .. నీ ప్రసంగానికి నా మనసు ఉప్పొగింది – చిరంజీవి

 Authored By ramu | The Telugu News | Updated on :15 March 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : తమ్ముడూ .. నీ ప్రసంగానికి నా మనసు ఉప్పొగింది - చిరంజీవి

Chiranjeevi : జనసేన పార్టీ 12వ అవిర్భావ సభ ఉత్సాహభరితంగా పిఠాపురంలో జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున జనసైనికులు, అభిమానులు హాజరై విశేషమైన ఆదరణను చూపించారు. ఈ సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తూ, పార్టీని పదకొండేళ్లుగా నిలబెట్టడానికి గల అనేక సవాళ్లు, సంక్లిష్ట పరిస్థితులను వివరించారు. రాజకీయాల్లోకి రావడం తన ముందస్తు ప్రణాళిక కాదని, కానీ ప్రజల కోసం సేవ చేయాలనే సంకల్పంతోనే ముందుకు వచ్చినట్లు పవన్ స్పష్టం చేశారు. జనసేనను ప్రజా సంక్షేమ పరిరక్షణ కోసం నిర్మించిన ఉద్యమంగా అభివర్ణించారు.

Chiranjeevi తమ్ముడూ నీ ప్రసంగానికి నా మనసు ఉప్పొగింది చిరంజీవి

Chiranjeevi : తమ్ముడూ .. నీ ప్రసంగానికి నా మనసు ఉప్పొగింది – చిరంజీవి

Chiranjeevi తమ్ముడి ప్రసంగానికి ఫిదా అయినా అన్న

పవన్ కళ్యాణ్ ప్రసంగానికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఎక్స్ వేదికగా చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. “మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్, జనసేన జయకేతన సభలో నీ ప్రసంగం మంత్రముగ్ధుణ్ని చేసింది. జనసేనికుల విజయఘోషల మధ్య నీ నాయకత్వ సామర్థ్యం మరింత బలంగా కనిపించింది. ప్రజాసంక్షేమం కోసం నీ నిరంతర ప్రయాణం విజయవంతం కావాలని నా ఆశీర్వాదాలు” అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహం జనసేన శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఈ అవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణాన్ని గురించి విశదీకరిస్తూ, పార్టీ భవిష్యత్తు దిశగా తన కలలను వివరించారు. జనసేనను కేవలం ఓ పార్టీగా కాకుండా, ప్రజా సంక్షేమ ఉద్యమంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక పవన్ ప్రసంగం చిరంజీవి స్పందన – రెండూ కలిపి జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది