Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెం.150 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సైరా చేసిన చిరంజీవి నిరాశ పర్చాడు. సైరా సినిమా తర్వాత ఆచార్య కు ఏకంగా మూడు సంవత్సరాల పాటు గ్యాప్ వచ్చింది. కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల ఆచార్య సినిమా చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు విడుదల అయిన ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి ఆలోచనల్లో పడ్డాడు అంటూ టాక్ మొదలు అయ్యింది. ఇప్పటికే చిరంజీవి గాడ్ ఫాదర్.. భోళా శంకర్.. వాల్తేరు వీరయ్య మరియు వెంకీ కుడుముల సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఈ నాలుగు సినిమాల్లో చిరంజీవి కొన్ని సినిమాలను రద్దు చేసుకుంటాడు అనే టాక్ వినిపిస్తుంది. ఆచార్య సినిమా నిరాశ పర్చడంతో గాడ్ పాదర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో భోళా శంకర్ సినిమా విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి అంటున్నారు. ముఖ్యంగా మెహర్ రమేష్ దర్శకత్వం అవ్వడం వల్ల ఆసక్తి లేదు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. మెగా స్టార్ చిరంజీవి తాజాగా వెంకీ కుడుముల మూవీ ని కూడా క్యాన్సల్ చేశాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి ఒక్క ఆచార్య ప్లాప్ తో రెండు మూడు సినిమాలను రద్దు చేసుకుంటే ఆయన అభిమానుల ముందు మరియు ఇండస్ట్రీ లో పరువు పోగొట్టుకున్నట్లే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఒక్క ఆచార్య ఆయన కెరీర్ ను తలకిందులు ఏమీ చేయలేదు. ఆయన ఒక బడా మెగాస్టార్.. కనుక ఆయన విషయంలో ఏ ఒక్కరు కూడా విమర్శలు చేసే అవకాశం లేదు. కనుక ఆయన ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను కంటిన్యూ చేసి వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో చిరంజీవి సినిమాల విషయంలో జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా పుకార్లే అంటూ కొందరు బలంగా నమ్ముతున్నారు. చాలా వరకు చిరంజీవి కమిట్ అయిన అన్ని సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. మరి చిరంజీవి ఏం చేయబోతున్నాడు అనేది తెలియాలంటే కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
This website uses cookies.