Home » Entertainment » Chiranjeevi Acharya Movie Release Date Is Fixed
Entertainment

Acharya : మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Authored By
praveen T
The Telugu News | Published on: October 9, 2021, 10:21 pm
Advertisement

Acharya : సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూద్దామా? అని ఎదురు చూస్తున్న మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం విడుదల తేదీని శనివారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రకటించారు.

Advertisement

Chiranjeevi acharya Movie release date is fixed

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయనున్నట్లు రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి వల్ల చిత్ర విడుదల తేదీ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఎట్టకేలకు అఫీషియల్‌గా రిలీజ్ డేట్ వచ్చేసింది.

Advertisement

Chiranjeevi acharya Movie release date is fixed

‘ఆచార్య’ చిత్రం నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి సరసన బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ నటించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి