Tollywood Heroes : బాబోయ్.. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ ల రెమ్యూనరేషన్స్ లో మరీ ఇంత వ్యత్యాసమా?
Tollywood Heroes ; 1980 మరియు 1990 లలో టాలీవుడ్ ని ఏలిన రారాజులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగార్జున. ఈ నలుగురు హీరోలు కూడా తెలుగు సినిమా కి నాలుగు స్తంభాలుగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 స్థానంలో ఉండగా బాలకృష్ణ నెంబర్ 2 స్థానంలో ఎప్పుడు నిలిచేవారు. ఆ తర్వాత స్థానంలో వెంకటేష్ మరియు నాగార్జున ఉండేవారు. ఈ స్థానాలను ఆయా హీరోలు రెండు దశాబ్దాల పాటు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా అదే నెంబర్ కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఏ సినిమా చేసిన కూడా ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుండడం
మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత స్థానంలో నందమూరి బాలకృష్ణ సినిమాలు కూడా భారీగా వసూళ్లు నమోదు చేస్తున్నాయి. ఈ రేసులో వెంకటేష్ మరియు నాగార్జున కాస్త వెనక పడ్డారని చెప్పాలి. ఒకప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో ఈ నలుగురు హీరోలకు వ్యత్యాసం కాస్తనే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పదుల కోట్లలో వ్యత్యాసం ఉంటుందని సమాచారం అందుతుంది. వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవి 75 నుండి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇక అఖండ మరియు వీరసింహారెడ్డి సినిమాలు సక్సెస్ అవ్వడంతో బాలకృష్ణ
40 నుండి 50 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటే వెంకటేష్ మరియు నాగార్జున మాత్రం సొంత సినిమాల్లో నటిస్తూ.. బయట సినిమాల్లో నటించినప్పుడు కాస్త తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. లాభాల్లో వాటను తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ వారు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడడం లేదు. మొత్తానికి ఈ నలుగురు సమఉజ్జీలే అయినప్పటికీ వారు చేస్తున్న సినిమాలు ఫలితాలను బట్టి రెమ్యూనరేషన్ ఉంటున్నాయి. భవిష్యత్తులో అందరి రెమ్యూనరేషన్ సమానంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు.