
Chiranjeevi and Balakrishna both Photos in my Home Said by Sukumar
sukumar : దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కొన్ని సెంటర్లలో డివైడ్ టాక్‌ను సొంతం చేసుకున్నా కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమాకు రూ.250 కోట్ల గ్రాస్ షేర్ వచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కానీ మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పుష్ప కమర్షియల్ హిట్ అవ్వడంతో సుకుమార్ పార్ట్-2 పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మొదటి భాగంపై వస్తున్న రీమార్క్స్‌ను పరిగణలోకి తీసుకుని సెకండ్ పార్ట్ చాలా జాగ్రత్తగా షూట్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సుకుమార్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘బాలయ్య ఆన్ స్టాపబుల్’ షోలో అతిథిగా మెరిసారు. బాలయ్య, సుక్కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
Chiranjeevi and Balakrishna both Photos in my Home Said by Sukumar
బాలయ్య బాబు చేస్తున్న ఆన్ స్టాపబుల్ షోలో గెస్ట్‌గా కనిపించిన సుకుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో రెండు వర్గాలు ఉండేవని చెప్పారు. అందులో ఒకటి చిరంజీవిది కాగా మరొకటి బాలయ్య బాబుది అన్నారు. మా ఇంట్లో మేము నలుగురు అన్నదమ్ములం అని తాను అందరికంటే చివరి వాడినని చెప్పారు సుకుమార్. మా పెద్దన్నయ్య బాలకృష్ణ డై హార్ట్ ఫ్యాన్ అని.. మిగతా ఇద్దరు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.
Chiranjeevi and Balakrishna both Photos in my Home Said by Sukumar
చిరు, బాలయ్య బాబు సినిమాలు రిలీజ్ అయితే చాలు మా ఇంట్లో పెద్ద యుద్దమే జరిగేదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అందుకే మా ఇంట్లో ఓ వైపు చిరంజీవి మరోవైపు బాలకృష్ణ ఫోటో ఉంటుందని వివరించారు సుక్కు.. మా పెద్దన్నయ్య మిమ్మల్ని కలిస్తే చాలా సంతోషిస్తాడని, నా కోసం మా అన్నయ్యకు ఐ లవ్ యూ చెప్పాలని బాలయ్యను కోరాడు సుకుమార్.. ఇక తాను బాలయ్యతో చాలా హిట్ సినిమాలు తీసానని అనడంతో అంతా షాక్ అయ్యారు. తాను చిన్నతనంలో చూసిన బాలకృష్ణ అని సినిమాలు హిట్ అయ్యానని.. వాటిని నేనే హిట్ చేశానన్నట్టు ఫన్నీ కామెంట్స్ చేశాడు సుకుమార్..
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.