Chiranjeevi : సినిమాలకి చిరంజీవి రాజీనామా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2022,4:40 pm

Chiranjeevi : తెలుగులో చాలామంది సీనియర్ హీరోలు ఇప్పటికీ హీరోలుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అభిమానులను మెప్పించడానికి ఎంతో కష్టపడుతున్నారు. బాలయ్య, చిరంజీవి లాంటి వాళ్ళు వయసు పైబడిన కూడా ఇప్పటికీ యాక్షన్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. కుర్ర హీరోలకు సమానంగా స్టైల్, లుక్, ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో చిరంజీవి

మాట్లాడుతూ తన రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించడం కోసమే కెమెరా ముందుకు వచ్చాను అని, నటుడిగా కెమెరా ముందు ఉన్నంతవరకు ఎక్కడికైనా వెళ్లడం సిద్ధమే అన్నారు. ఆ షూట్ అయిపోయాక తన బాధలు తాను పడతానని, ఫ్యాన్స్ ను అలరించడానికి ఎటువంటి ఇబ్బందులు నైనా ఎదుర్కొంటాను, ఎంత బాధ ఉన్న బయటకు వ్యక్తం చేయమని అన్నారు. ఇక సినిమాలో తాను నటించలేకపోతున్నానని అనిపిస్తే ఆరోజు సినిమాల

Chiranjeevi announce retirement to films

Chiranjeevi announce retirement to films

నుంచి తప్పుకుంటానని అప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటానని చిరు చెప్పారు. అయితే అలాంటి రోజు ఒక నటుడు జీవితంలో ఉండకూడదని చిరంజీవి చెప్పారు. ఇండస్ట్రీకి కష్టపడటానికి వచ్చామని, ఎన్ని ఇబ్బందులు ఉన్న ఎదుర్కొన్న వారే మంచి స్థాయిలో నిలబడతారు అని చిరు చెప్పారు. ఏదేమైనా చిరంజీవి చివరిదాకా సినిమాలో నటించాలని గట్టి పట్టుదలతో ఉన్నారని ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితోపాటు రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి