Chiranjeevi Reaction To Ali Speech About Pawan Kalyan
Pawan Kalyan : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి ఇప్పుడు గతంలో కన్నా చాలా భిన్నంగా ఉంది. ఒకప్పుడు రెబల్‌గా కనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనని ఎవరు ఎంత విమర్శించన కూడా కూల్‌గా ఉంటున్నారు. పవన్‌లో మార్పు చూసి అందరు అవాక్కవుతున్నారు. అయితే ఒకసారి పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని ఎవరో నానా మాటలు అన్నారని వారిని చితక్కొట్టాడు. ఈ క్రమంలో చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మరి ఆ వివరాలేంటో తెలియాలంటే ఈ వీడియో చూడల్సిందే.. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మెగాస్టార్ నట వృక్షం నుండి ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. వారందరు చిరంజీవి స్పూర్తితోనే హీరోలుగా రాణిస్తున్నారు.
ఆయన వేసిన దారిలో పయనించి ఇప్పుడు స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి రావడానికి చిరంజీవి ముఖ్యం కారణం అన్నది జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్‌కి ఆ కృతజ్ఞత తప్పక ఉంటుది. తన అన్నయ్యని చిన్నమాట ఎవరైన అంటే అస్సలు ఊరుకోడు. సినిమా వాళ్లైన ,రాజకీయ నాయకులైన పవన్‌ని విమర్శిస్తే వెంటనే స్పందిస్తూ వస్తున్నారు. రాముడికి లక్ష్మణుడిలా చిరంజీవికి ఎప్పుడు తోడుగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. అప్పట్లో చిరంజీవి తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా అన్న బాటలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో చిరంజీవి హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే అప్పట్లో గుండాయిజం ఎక్కువగా ఉండేది. అయితే చిరంజీవి నటిస్తున్న షూటింగ్ స్పాట్ లోకి వచ్చి కొందరు గుండాలు, ఆకతాయిలు అల్లర్లు చేశారు. ఇంకొంతమందైతే చిరంజీవి ని బూతులు తిట్టే సారు.
Chiranjeevi apologizes to crushed Pawan Kalyan
కానీ చిరంజీవి వారిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి డ్రైవర్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చెప్పగా ఆ మాటలు వినగానే కోపంతో ఊగిపోయాడు పవన్ కళ్యాణ్. కోపాన్ని ఆపుకోలేక మరుసటి రోజు షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వచ్చి అక్కడున్న గుండాలను ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. అయితే పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోని గూండాలు పవన్ తో గొడవకు దిగారట. కోపం ఆపుకోలేని పవన్ కళ్యాణ్ ఆ గుండాల లో ఒకరిని బాగా కొట్టారట. పవన్ కొట్టిన దెబ్బలతో హాస్పిటల్ లో పడ్డాడు ఓ వ్యక్తి. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అనుకున్నదే తడవుగా హాస్పిటల్ కి వెళ్లి తమ్ముడు పవన్ చేసిన పనికి ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా అతని ట్రీట్మెంట్ కి, మందులకు, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడట. ఇంకొకసారి ఇలా చేయకూడదని పవన్ ని కూడా హెచ్చరించాడట.
ఇలా తమ్ముడు చేసిన పనికి చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంతే దూకుడిగా వ్యవహరిస్తున్నారు. పవన్ రాజకీయాలలోకి వెళ్లిన కూడా తన అన్న మద్దతు తప్పనిసరిగా ఉంటుందనేది అందరికి తెలుసు. చిరంజీవి సూచనలతోనే పవన్ కల్యాణ్ రాజకీయాలలో ప్రభంజనం సృష్టించబోతున్నారని కొందరు జనసైనికులు అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాక పూర్తిగా సినిమాలకు దూరమవుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దారుణంగా మొదటి ప్రయత్నం విఫలం కావడంతో వెంటనే వరుస సినిమాలు అనౌన్స్ చేశారు.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లానింగ్ లేమి కారణంగా ఆయనతో సినిమాలు చేయాల్సిన దర్శకుల షెడ్యూల్స్ అన్ని తారుమారయి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. వారంతా తమ కెరీర్ ని పణంగా పెట్టి పవన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు ప్రకటించిన దర్శకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. ఆయన క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేయడం అవి క్రిష్ కి నచ్చకపోవడంతో చాలా కాలం నుంచి షూటింగ్ ఆగిపోయింది. ఎట్టకేలకు సంధి కుదిర్చారని త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.