Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!
ప్రధానాంశాలు:
Chiranjeevi మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ మీట్.. చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సంక్రాంతి సినిమాల విజయాలపై స్పందించిన చిరంజీవి మాట్లాడుతూ, “నేను కోరుకున్నట్లుగానే సంక్రాంతికి వచ్చిన సినిమాలను ప్రజలు ఆదరించారు. ఏదో ఒకటి, అర సినిమాలు తప్పా అన్నీ మంచి విజయం సాధించాయి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు నెట్టింట పెద్ద డిబేట్‌కు దారి తీశాయి.
Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!
Chiranjeevi : రాజా సాబ్ గురించా..
చిరంజీవి చేసిన ఈ మాటల్లోని “ఏదో ఒకటి, అర సినిమాలు” అన్న వ్యాఖ్య ఏ సినిమాను ఉద్దేశించి అన్నారనే అంశంపై ఫ్యాన్స్‌తో పాటు సినీ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాపై పరోక్షంగా చేసినవేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో పాటు, ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ స్పందన తెచ్చుకున్నాయి. అయితే ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మాత్రం పలు కారణాల వల్ల విడుదల ఆలస్యం కావడం, అలాగే సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉండటంతో, చిరంజీవి వ్యాఖ్యలు ఆ సినిమాపైనే కేంద్రీకృతమై ఉన్నాయనే వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా స్పష్టంగా ఏ సినిమా పేరు ప్రస్తావించలేదు. సాధారణంగా ఆయన మాటలు పరిశ్రమ మొత్తాన్ని ఉద్దేశించి ఉంటాయని, వ్యక్తిగతంగా ఏ హీరో లేదా సినిమాపై విమర్శ చేసే వ్యక్తి కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యాఖ్యలను అతిగా విశ్లేషిస్తున్నారని, అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, ‘మన శంకరవరప్రసాద్’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేసిన ఒక్క వ్యాఖ్య టాలీవుడ్‌లో మరోసారి ఫ్యాన్ వార్స్‌కు తెరలేపింది. ఇది నిజంగా ఏదైనా సినిమాపై చేసిన పరోక్ష వ్యాఖ్యలేనా? లేక సాధారణంగా సంక్రాంతి సీజన్ ట్రెండ్‌ను మాత్రమే వివరించారా? అన్నది మాత్రం ప్రేక్షకుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉందని చెప్పాలి.