Chiranjeevi : నేను దూరంగా ఉంటేనే పవన్ కి మంచిది.. చిరంజీవి కామెంట్స్ లో అది క్లారిటీగా అర్ధమవుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : నేను దూరంగా ఉంటేనే పవన్ కి మంచిది.. చిరంజీవి కామెంట్స్ లో అది క్లారిటీగా అర్ధమవుతుంది..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైఉరక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరు ప్రస్తుతం పాలిటిక్స్ గురించి ప్రస్థావించారు. అంతేకాదు జనసేనకు తన మద్ధతు ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ ఇంకా పొల్యూట్ కాలేదని.. ఓ నిబద్ధత కలిగిన […]

 Authored By ramesh | The Telugu News | Updated on :5 October 2022,11:30 am

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైఉరక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరు ప్రస్తుతం పాలిటిక్స్ గురించి ప్రస్థావించారు. అంతేకాదు జనసేనకు తన మద్ధతు ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ ఇంకా పొల్యూట్ కాలేదని.. ఓ నిబద్ధత కలిగిన వ్యక్తి అని.. తప్పకుండా రాజకీయాల్లో మార్పు తెస్తారని అన్నారు. అయితే తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. తమ్ముడికి సపోర్ట్ చేసే అవకాశం లేదని అన్నారు చిరు.

అయితే భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. అయితే చిరు జనసేనకు మద్ధతు ఇస్తారా లేదా అన్నది తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం ఏర్పడింది. అయితే చిరు చాలా తెలివిగా ఈ విషయంపై స్పందించారు. తమ్ముడికి అవసర్మైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు చిరు. గాడ్ ఫాదర్ సినిమా మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా వస్తుంది. మోహన్ రాజా డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటించారు.

Chiranjeevi comments on pawan kalyan janasena

Chiranjeevi comments on pawan kalyan janasena

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటించారు. సినిమాలో చిరు పొలిటికల్ లీడర్ గా కనిపిస్తారు. అయితే సినిమాలో కొన్ని డైలాగ్స్ వైసీపీని టార్గెట్ చేశారని కామెంట్స్ వచ్చాయి. కానీ అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు చిరు. ఆచార్య ఫ్లాప్ అవగా గాడ్ ఫాదర్ సినిమాపై ప్రెజర్ ఉంది. సినిమాలో సత్యదేవ్, సునీల్ వంటి స్టార్స్ కూడా నటించారు. చిరు గాడ్ ఫాదర్ సినిమా 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. గాడ్ ఫాదర్ హిట్ అవ్వాలి అంటే 100 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంది. చిరంజీవి తో పాటుగా ఈరోజు నాగార్జున ది ఘోస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది