Chiranjeevi | సైకిల్‌పై వందల కిలోమీటర్లు ప్రయాణించిన అభిమాని.. రాజేశ్వరికు మెగాస్టార్ చిరంజీవి అండ
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా అభిమానికి మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో అండగా నిలిచారు. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ వరకు సైకిల్‌పై ప్రయాణించిన రాజేశ్వరి అనే అభిమానికి చిరు భరోసానిచ్చారు. ఆమె పిల్లల చదువు బాధ్యతను స్వయంగా తీసుకుంటానని ప్రకటించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

#image_title
దటీజ్ చిరు..
కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి, చిరంజీవికి వీరాభిమాని. తాను అభిమానించే నటుడిని ప్రత్యక్షంగా కలవాలన్న ఆరాటంతో సైకిల్‌పై వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. గతంలో పవన్ కల్యాణ్ కోసం ఆదోనికి చెందిన ఆమె అమరావతికి సైకిల్ యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మెగాస్టార్ కోసం మరోసారి అలాంటి సాహసమే చేసారు.
ఆమె ప్రయాణంలో పలుచోట్ల మెగా అభిమానులు స్వాగతం పలికారు, సంఘీభావం వ్యక్తం చేశారు. చివరకు చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసిన రాజేశ్వరి, తన పిల్లలతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవిని కలిసిన ఆ క్షణం రాజేశ్వరి జీవితంలో మరపురాని ఘట్టంగా మారింది. ఆయనను దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తూ, రాఖీ కట్టి తన అభిమానాన్ని చూపించారు. ఈ క్షణంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆవేశాన్ని గమనించిన చిరంజీవి, ఆమెను ఆప్యాయంగా ఓదార్చారు. ఆమెకి చీరను బహుమతిగా ఇచ్చిన చిరు, ఆమె పిల్లల చదువు భాద్యతను తన భుజాలపై వేసుకుంటానని ప్రకటించారు. “పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించి మీకు మద్దతుగా నిలవాలి,” అని కోరారు.