Home » Entertainment » Chiranjeevi Gets In Troubles
Entertainment

Chiranjeevi : మేము అల్లాడిపోతుంటే, నీకు ఫ్యామిలీ ట్రిప్ అవ‌స‌రమా అంటూ చిరంజీవిపై ఫైర్

Authored By
Sam C
The Telugu News | Published on: May 5, 2022, 5:30 pm
Advertisement

Chiranjeevi : దాదాపు మూడేళ్ల త‌ర్వాత ఆచార్య చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు చిరంజీవి. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌, కొర‌టాల వంటి స్టార్ డైరెక్ట‌ర్ సినిమాని తెర‌కెక్కించినా కూడా మూవీకి స‌క్సెస్ అంద‌లేదు.అయితే చిరు త‌న త‌ర్వాతి సినిమాల‌తో అల‌రించాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త‌న బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. తీరిక లేని షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ‌తో క‌లిసి స‌మ్మ‌ర్ ట్రిప్‌కు విదేశాల‌కు వెళ్లారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు.

Advertisement

పాండమిక్ తర్వాత తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చిన్న హాలీడే తీసుకుని సురేఖతో కలిసి చాలా రోజుల తర్వాత యు.ఎస్, యూరప్ వెళుతున్నాం. త్వరలోనే అందరినీ కలుస్తాను’’ అంటూ చిరంజీవి మెసేజ్‌తో పాటు సురేఖ‌తో ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రం నెగెటివ్ టాక్‌తో న‌డుస్తున్న నేప‌థ్యంలో బ‌య్య‌ర్స్ ప‌రిస్థితి దారుణంగా మారింది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కొంచెం డల్ గా ఉందని తెలుస్తుంది. ఇక బయ్యర్లకు ఇచ్చిన మాట కొరటాల శివ నిలుపుకోలేకపోయాడు.

chiranjeevi gets in troubles

Advertisement

Chiranjeevi : బ‌య‌ర్ల ప‌రిస్థితి దారుణం..

ఇక నిర్మాత నిరంజన్ రెడ్డి విషయానికొస్తే బయ్యర్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇక బయ్యర్లకు మిగిలిన దిక్కు చిరంజీవి మాత్రమే కాగా ఆచార్య బయ్యర్లు గత నాలుగు రోజులుగా చిరంజీవి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం తన ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ వెళ్ళినట్లు తెలుస్తుంది.చిరంజీవి నెల రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బయ్యర్లు ఇక్క‌డ మా పరిస్థితులు దారుణంగా ఉంటే.. నీకు సరదాలు కావాలా అన్నట్టు ఆవేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి